News April 7, 2025
BREAKING: వల్లభనేని వంశీకి బెయిల్

AP: భూకబ్జా కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి గన్నవరం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ రాకపోవడంతో ఆయన జైలులోనే ఉండాల్సి ఉంటుంది. మరోవైపు టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులోనూ వంశీ విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ రెండు కేసుల్లో ఆయనకు బెయిల్ వస్తేనే జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
Similar News
News April 8, 2025
తెల్లదొరల పాలిట సింహస్వప్నమై..

తొలి స్వాతంత్ర్య ఉద్యమ ప్రస్తావన రాగానే గుర్తొచ్చే పేరు మంగళ్ పాండే. భారతీయులను బానిసలుగా మార్చి పాలిస్తున్న తెల్లవారిని ఎదిరించి సిపాయిల తిరుగుబాటుకు పునాది వేశారు. బ్రిటిషర్ల దురాగతాలపై కదం తొక్కి వారి పాలిట సింహస్వప్నంలా మారారు. అదే క్రమంలో తెల్ల దొరలపై దాడి చేయగా పాండేకు ఉరిశిక్ష విధించారు. 1857లో పాండే తిరుగుబాటే సిపాయిల తిరుగుబాటుగా మొదటి స్వాతంత్ర ఉద్యమంగా మారింది. ఇవాళ ఆయన వర్ధంతి.
News April 8, 2025
APSRTC 750 ఎలక్ట్రిక్ బస్సులు

APకి కేంద్రం శుభవార్త అందించింది. ‘PM ఈ-బస్ సేవా’ కింద తొలి దశలో 750 ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. విజయవాడ, GNT, VSKP, కాకినాడ, రాజమండ్రి, NLR, తిరుపతి, కర్నూలు, అనంతపురం, మంగళగిరి, కడప నగరాల్లో వీటిని తిప్పనుంది. PPP పద్ధతిలో 10వేల బస్సులను రాష్ట్రాలకు కేంద్రం ఇస్తుండగా, ఏపీకి 750 కేటాయించింది. త్వరలోనే ఏ డిపోకు ఎన్ని కేటాయించాలనే దానిపై వివరాలను అధికారులు వెల్లడించనున్నారు.
News April 8, 2025
లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్స్

నిన్న భారీ నష్టాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1089 పాయింట్ల లాభంతో 74,227, నిఫ్టీ 282 పాయింట్లు పొంది 22,444 వద్ద మొదలయ్యాయి. HUL, ట్రెంట్, టాటా స్టీల్, హిందాల్కో, శ్రీరామ్ ఫైనాన్స్ లాభాల్లో కొనసాగుతున్నాయి. ట్రంప్ టారిఫ్స్ ప్రభావం నుంచి భారత్ సహా వివిధ దేశాల స్టాక్స్ స్వల్పంగా కోలుకుంటున్నాయి.