News April 7, 2025

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో BJP-MIM

image

TG: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోటీకి నామినేషన్ల పరిశీలన ముగిసింది. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను ఎలక్షన్ కమిషన్ తిరస్కరించింది. కాంగ్రెస్, BRS పార్టీల నుంచి అభ్యర్థులెవరూ పోటీ చేయట్లేదు. దీంతో భాగ్యనగరంలో BJP-MIM రెండు పార్టీలే తలపడనున్నాయి. ఈ నెల 23న ఎన్నికలు జరగనుండగా. 25న ఓట్ల లెక్కింపు ఉండనుంది.

Similar News

News April 8, 2025

రెండేళ్లలో 12 భాషల్లో ఇంజినీరింగ్ పుస్తకాలు

image

మరో రెండేళ్లలో 12 భాషల్లో ఇంజినీరింగ్ పుస్తకాలు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రక్రియ వేగవంతమైందని AICTE ఛైర్మన్ సీతారాం తెలిపారు. ఇంజినీరింగ్ డిప్లోమా, డిగ్రీ కోర్సుల మొదటి, రెండో సంవత్సరాల కోసం 600 పుస్తకాలు సిద్ధమైనట్లు తెలిపారు. 3, 4వ సంవత్సరాలకు సంబంధించిన పుస్తకాలను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. ఈ పుస్తకాలను అనువదించేందుకు ఏఐ సాంకేతికను ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు.

News April 8, 2025

నేడు భారత్‌కు వస్తున్న దుబాయ్ క్రౌన్ ప్రిన్స్

image

దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ అల్ మఖ్తూమ్ రెండు రోజుల పర్యటన కోసం నేడు భారత్ వస్తున్నారు. రెండు దేశాల మధ్య ట్రేడ్, వ్యూహాత్మక సంబంధాలపై ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు జైశంకర్, రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ కానున్నారు. యువరాజు హోదాలో ఇది ఆయన తొలి భారత పర్యటన. ఇటీవల అబుదాబి క్రౌన్ ప్రిన్స్ ఖలీద్ బిన్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఇండియాలో పర్యటించిన విషయం తెలిసిందే.

News April 8, 2025

రేషన్ లబ్ధిదారులకు షాక్

image

TG: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం తీసుకుందామనుకున్న రేషన్ లబ్ధిదారులకు డీలర్లు షాకిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో షాపులు ఓపెన్ చేయడం లేదు. మిగతా చోట్ల టైం పాటించడం లేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. దీంతో రేషన్ షాపులు ఎప్పుడు తీస్తారోనని లబ్ధిదారులు వాటి చుట్టూ కాళ్లరిగేలా ప్రదక్షిణలు చేస్తున్నారు. అధికారులు దీనిపై ఫోకస్ పెట్టాలని కోరుతున్నారు. మీ జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉందా?

error: Content is protected !!