News April 7, 2025
MNCL: పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్ లో సోమవారం పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. సబ్జెక్టుకు ఒకరు చొప్పున ఏడుగురు అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్స్, 65 మంది చీఫ్ ఎగ్జామినర్స్, 390 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్స్, 130 మంది స్పెషల్ అసిస్టెంట్స్ విధుల్లో చేరగా.. 7,280 పేపర్లు మూల్యాంకనం చేశారు. మూల్యాంకనాన్ని డీఈఓ యాదయ్య పర్యవేక్షించారు.
Similar News
News January 14, 2026
GNT: బాహుబలి బ్రిడ్జిపై ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్ (అప్డేట్)

అమరావతి బాహుబలి బ్రిడ్జిపై పండగ పూట ఘోర ప్రమాదం జరిగిన విషయం <<18856366>>తెలిసిందే. <<>>తుళ్లూరుకి చెందిన మార్క్ (50), రిటైర్డ్ రైల్వే ఉద్యోగి పౌలు (65) ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వెంకటపాలెం నుంచి విజయవాడ వైపు ద్విచక్ర వాహనంపై రాంగ్ రూట్లో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. వీరిద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మంగళగిరి ఎయిమ్స్‌కు తరలించారు.
News January 14, 2026
విశాఖ: రైళ్లలో టీ, కాఫీ కోసం Hitech గ్యాడ్జెట్

వాల్తేరు రైల్వే డివిజన్ ప్రయాణికులకు శుభవార్త. టీ, కాఫీ విక్రయాల కోసం సరికొత్త ‘హైటెక్ వేరబుల్ గ్యాడ్జెట్’ను డీఆర్ఎం లలిత్ బోహ్రా బుధవారం ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రారంభించారు. ఈ ఇన్సులేటెడ్ పరికరం ద్వారా పానీయాలు ఎక్కువసేపు వేడిగా, పూర్తి పరిశుభ్రంగా లభిస్తాయి. వెండర్స్ మెడలో ధరించే ఈ గ్యాడ్జెట్లో డిజిటల్ పేమెంట్, వేస్ట్ కలెక్షన్ సౌకర్యం ఉండటం విశేషం. ఇది ప్రయాణికులకు సురక్షితమైన సేవలను అందిస్తుంది.
News January 14, 2026
నక్కపల్లి: రైతు గెటప్‌లో ఎడ్లబండి తోలిన హోంమంత్రి

హోంమంత్రి వంగలపూడి అనిత క్యాంప్ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు ఉదయం నుంచి వైభవంగా కొనసాగుతున్నాయి. సంబరాల్లో భాగంగా రైతు గెటప్‌లో మంత్రి ఎడ్ల బండి తోలి సందడి చేశాసారు. పండుగ అందరి ఇళ్లలో భోగభాగ్యాలను నింపాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ ఉత్సవాల్లో టీడీపీ నాయకులు, నియోజకవర్గం జనసేన సమన్వయకర్త గెడ్డం బుజ్జి తదితరులు పాల్గొన్నారు.


