News April 7, 2025
ప్రభుత్వానికి సలహా మండలి: సీఎం చంద్రబాబు

AP: ప్రజలకు సుపరిపాలన అందించడం కోసం సలహా మండలిని నియమించనున్నట్లు RTGSపై సమీక్షలో CM చంద్రబాబు ప్రకటించారు. సభ్యులుగా గేట్స్ ఫౌండేషన్, IIT సహా వివిధ రంగాలకు చెందిన 10 మంది నిపుణులు ఉండనున్నారు. ప్రజలకు మరింత మేలు చేసేలా, సుపరిపాలన అందించేలా ఇంకా ఏమి చేయవచ్చనే దానిపై ఈ మండలి అధ్యయనం చేసి సూచనలు ఇవ్వనుందని వివరించారు. కాగా జూన్12 కల్లా వాట్సాప్‌లోకి అన్ని సేవలను తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News April 8, 2025
ముంబై పర్యటనకు కందుల దుర్గేశ్

AP: పర్యాటక శాఖలో పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి కందుల దుర్గేశ్ ఈ నెల 9, 10 తేదీల్లో ముంబైలో పర్యటించనున్నారు. పోవై లేక్‌లో జరిగే దక్షిణాసియా 20వ హోటల్ ఇన్వెస్ట్‌మెంట్ కాన్ఫరెన్స్ వర్క్‌షాప్‌లో పాల్గొననున్నారు. ఆతిథ్య రంగంలో పెట్టుబడుల అవకాశాలు, రాయితీలు వంటివి వివరించి ఇన్వెస్టర్లను ఆహ్వానించనున్నారు. మంత్రితో పాటు పర్యాటక శాఖ సెక్రటరీ అజయ్ జైన్, టూరిజం ఎండీ ఆమ్రపాలి వెళ్లనున్నారు.
News April 8, 2025
జంట పేలుళ్ల కేసు.. హైకోర్టు సంచలన తీర్పు

TG: దిల్‌సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో HC సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష విధించింది. దోషులు తహసీన్ అక్తర్, భక్తల్, అజాబ్, అసుదుల్లా అక్తర్, రెహ్మాన్‌కు గతంలో NIA కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడం సరైనదేనని పేర్కొంది. 2013లో జరిగిన వరుస పేలుళ్ల ఘటనలో 18 మంది మరణించగా 131 మంది గాయపడ్డారు. కాగా ఈ దాడుల ప్రధాన సూత్రధారుడు రియాజ్ భత్కల్ ఇంకా పరారీలోనే ఉన్నాడు.
News April 8, 2025
ట్రై-సిరీస్‌కు భారత మహిళల జట్టు ప్రకటన

సౌతాఫ్రికా, శ్రీలంకతో ఈ నెల 27 నుంచి జరగనున్న ట్రై-నేషన్ ODI సిరీస్ కోసం భారత మహిళల జట్టును BCCI ప్రకటించింది. గాయం కారణంగా రేణుకా సింగ్, టిటాస్ సాధును సెలక్షన్స్‌కు పరిగణించలేదు.
జట్టు: హర్మన్ ప్రీత్ కౌర్(C), స్మృతి మంధాన, ప్రతిక, హర్లీన్, రోడ్రిగ్స్, రిచా ఘోష్, యాస్తికా భాటియా, దీప్తి శర్మ, అమన్ జోత్ కౌర్, కాశ్వీ గౌతమ్, స్నేహ్ రాణా, అరుంధతి రెడ్డి, తేజల్ హసబ్నీస్, శ్రీ చరణి, సుచి ఉపాధ్యాయ్.