News April 7, 2025
HYD: పేకాట కేసులో ఓ MLA సన్నిహితుడు..?

మేడ్చల్ PS పరిధిలో గత శనివారం అర్ధరాత్రి SOT 14 మంది బృందం పేకాట ముఠా గుట్టురట్టు చేసిన విషయం తెలిసిందే. మేడ్చల్ పరిధి పూడూరులోని ఓ ఫామ్ హౌస్‌లో దాడులు నిర్వహించగా ఇందులో 18 మంది పేకాట ఆడుతుండగా అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.4 లక్షలకు పైగా నగదు,16 ఫోన్లు,12 కారులను సీజ్ చేసినట్లు సమాచారం. ఈ కేసులో ఓ పార్టీ ఎమ్మెల్యే సన్నిహితుడు ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 24, 2025
పాక్ ప్రభుత్వ ట్విటర్ ఖాతా నిలిపివేత

పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ట్విటర్ ఖాతాను భారత్ బ్యాన్ చేసింది. ఆ ట్విటర్ పేజీ ఓపెన్ చేస్తే ‘విత్‌హెల్డ్’ అని చూపిస్తోంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌తో ఉన్న అన్ని దారుల్ని భారత్ మూసేస్తున్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య రాకపోకల్ని, దౌత్య సంబంధాల్ని కట్ చేసింది. అటు సింధు జలాల ఒప్పందాన్నీ సస్పెండ్ చేసింది. ఇప్పుడు నెట్టింట కూడా పాక్‌కు యాక్సెస్ లేకుండా అడ్డుకుంది.
News April 24, 2025
మరికాసేపట్లో మధుసూదన్ ఇంటికి మంత్రి ఆనం

ఉగ్రవాదుల దాడిలో కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. నేడు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు మధుసూదన్ కుటుంబాన్ని మంత్రి ఆనం పరామర్శించనున్నారు.
News April 24, 2025
ఫిరంగిపురం: టెన్త్ విద్యార్థి ఆత్మహత్య

ఫిరంగిపురం మండల కేంద్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పదో తరగతి ఫలితాల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురైన పి. వినయ్ కుమార్ అనే విద్యార్థి బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక పాఠశాలలో చదువుతున్న అతను ఫలితాల అనంతరం తాత ఇంటికి వెళ్లి ఉరివేసుకున్నాడు. గమనించిన స్థానికులు అతడిని సమీప ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు.