News April 7, 2025

NLG: యాక్సిడెంట్‌లో ఎమ్మెల్సీ కోటిరెడ్డి డ్రైవర్ మృతి

image

నిడమనూరు మండలం గుంటిపల్లి సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడు ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి కారు డ్రైవర్ నరసింహగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Similar News

News April 8, 2025

NLG: రైతు ఖాతాల్లో రూ.419.21 కోట్లు జమ!

image

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న యాసంగి రైతు భరోసా ఇప్పటి వరకు జిల్లాలో 4.33 లక్షల మంది రైతులకు అందింది. మొత్తం రూ.419.21 కోట్లు ఆయా రైతుల ఖాతాల్లో జమయింది. నాలుగు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకే ప్రభుత్వం రైతు భరోసా అందించింది. ఇంకా సుమారు 2 లక్షల మంది రైతులు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు 4 విడతల్లో రూ.419.21 కోట్లు జమ చేసినట్లు డీఈవో పాల్వాయి శ్రవణ్ కుమార్ తెలిపారు.

News April 8, 2025

NLG జిల్లా ప్రజలపై రూ.3 కోట్ల భారం !

image

మరోసారి వంటగ్యాస్ ధరలు పెరిగాయి. గృహ వినియోగ సిలిండర్‌పై రూ.50 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు నేటి నుంచి అమలులోకి వస్తాయి. దీంతో ప్రస్తుతం రూ.875గా ఉన్న సిలిండర్ ధర సవరించిన ధర రూ.50లతో కలిపి రూ.925కు చేరింది. ప్రస్తుతం రూ.503గా ఉన్న ఉజ్వల్ సిలిండర్‌కు కూడా పెంపు వర్తిస్తుందని తెలిపారు. దీంతో ఉజ్వల్ సిలిండర్ రూ.553కు చేరుకోనుంది. జిల్లా ప్రజలపై సుమారు 3 కోట్లకు పైగా భారం పడనుంది.

News April 8, 2025

బుద్ధవనాన్ని సందర్శించనున్న మిస్ వరల్డ్ పోటీదారులు

image

బుద్ధపూర్ణిమ సందర్భంగా మే 12న నాగార్జునసాగర్ బుద్ధవనాన్ని మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మిస్ వరల్డ్ పోటీ దారుల రాక ఏర్పాట్లపై సోమవారం తన ఛాంబర్‌లో పర్యాటక, రెవెన్యూ, పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆసియా దేశాలకు చెందిన 30 మంది ప్రపంచ సుందరి పోటీదారులు రానున్నారు.

error: Content is protected !!