News March 26, 2024
ధోనీ కోసం వెయిటింగ్: బాబీ

చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో డైరెక్టర్ బాబీ, సంగీత దర్శకుడు తమన్ సందడి చేశారు. చెన్నైలోని చిదంబరం స్టేడియానికి వెళ్లిన వారు మ్యాచ్‌ను తిలకించారు. ‘స్టేడియంలో నేను చూస్తున్న మొదటి మ్యాచ్ ఇదే. నా అభిమాన క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీని చూడటానికి వెయిటింగ్’ అని బాబీ ట్వీట్ చేశారు.
Similar News
News March 13, 2026
నువ్వుల పంటలో బిహారీ గొంగళి పురుగులను ఎలా నివారించాలి?

నువ్వుల పంట తొలిదశలో చిన్న గొంగళి పురుగులు ఆకు పత్రహరితాన్ని గోకి తినడం వల్ల ఆకులు జల్లెడలా మారతాయి. ఎదిగిన గొంగళి పురుగులు మొగ్గలకు, పువ్వులకు, కాయలకు రంధ్రాలు చేసి విత్తనాలను తింటాయి. వీటి నివారణకు ఎకరాకు 16- 20 పక్షి స్థావరాలను, హెక్టారుకు ఒక దీపపు ఎరను అమర్చాలి. తొలుత లీటరు నీటికి వేపనూనె 5mlను, తర్వాతి దశలో లీటరు నీటికి క్లోరిఫైరిపాస్ 2.5ml లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. కలిపి పిచికారీ చేయాలి.
News March 13, 2026
హార్ముజ్‌లో ముగ్గురు భారత నావికుల మృతి

హార్ముజ్ జలసంధి వద్ద చిక్కుకుపోయిన నౌకల్లోని ముగ్గురు భారత నావికులు ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్రం ధ్రువీకరించింది. మరొకరి జాడ తెలియాల్సి ఉన్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో వందలాది భారతీయులతో కూడిన ఇండియన్ షిప్స్ ఉన్నట్లు తెలిపింది. వీరి భద్రతను పర్యవేక్షించేందుకు కేంద్రం 24 గంటల కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి ప్రతి నౌకను ట్రాక్ చేస్తున్నట్లు పేర్కొంది.
News March 13, 2026
ఈ యాప్ గురించి మీకు తెలుసా?

మీ ఇంటి పరిసరాల్లో చెత్త పేరుకుపోయిందా? మూగజీవి చనిపోయి కుళ్లిన వాసనతో ఇబ్బంది పడుతున్నారా? వీటి గురించి కంప్లైంట్ చేసేందుకు ‘Swachhata’ అనే యాప్ ఉంది. వివిధ సమస్యలను ఫొటో తీసి యాప్‌లో అప్‌లోడ్ చేస్తే చాలు. నేరుగా మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు వెళ్తుంది. నిర్ణీత సమయంలోగా అధికారులు ఆ సమస్యను పరిష్కరించి, ఫొటోను అప్‌లోడ్ చేస్తారు. ఇది కేవలం పట్టణ ప్రాంతాల్లోనే అందుబాటులో ఉంది.


