News April 7, 2025
ఒంటిమామిడిపల్లి పాఠశాలను సందర్శించిన ఆకునూరి

ఒంటిమామిడిపల్లి పాఠశాలను విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి సందర్శించారు. విద్యార్థులను ఛైర్మన్ పలు అంశాల్లో ప్రశ్నించి వారి ప్రతిభా పాటవాలను మెచ్చుకున్నారు. తరగతి గదులు, ప్రీ ప్రైమరీ ప్లే టూల్స్, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, మినరల్ వాటర్ ప్లాంట్, సీసీ కెమెరాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉన్నారు.
Similar News
News April 17, 2025
పెద్దపల్లి: 15 రోజుల వ్యవధిలో ఇద్దరు మిత్రులు మృతి

పెద్దపల్లి జిల్లా సర్కిల్ విద్యుత్ శాఖలో 15రోజుల వ్యవధిలో ఇద్దరు సబ్ స్టేషన్ ఆపరేటర్లు మృతి చెందారు. ఈ నెల 3న సబ్ స్టేషన్ ఆపరేటర్ రాజ్ కుమార్ పెద్దపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ అద్దె ఇంట్లో అనుమానాస్పదకంగా మృతిచెందాడు. జీడికే పీజీ సెంటర్ సబ్ స్టేషన్‌లో పని చేస్తున్న సామల రవి గురువారం గుండెపోటుతో మృతి చెందాడు. కాగా వీరిద్దరు గతంలో ముంజంపల్లి సబ్ స్టేషన్‌లో 10 ఏళ్లు కలిసి పని చేశారు.
News April 17, 2025
వనపర్తి: ‘వక్ఫ్ సవరణ చట్టం రద్దు చేయాలి’

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన వక్ఫ్ బోర్డు చట్టాన్ని రద్దు చేయాలని ఆవాజ్ రాష్ట్ర నాయకుడు MD జబ్బార్ డిమాండ్ చేశారు. గురువారం ఆవాజ్ వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని అన్ని పార్టీల నాయకులు, ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. వక్ఫ్ సవరణ చట్టం రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు.
News April 17, 2025
బషీర్‌బాగ్: ఎడ్యుకేషన్ పాలసీ-2020పై సెమినార్

బషీర్‌బాగ్‌లోని SCERT కార్యాలయంలో తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ఆధ్వర్యంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020పై సెమినార్ జరిగింది. కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొ.హరగోపాల్, ప్రొ.శాంత సిన్హా, ప్రొ.రామ మేల్కొటి, ప్రొ.కోదండరాం తదితరులు పాల్గొని వ్యాసాలు సమర్పించారు.