News April 7, 2025
ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ కొట్టేయండి: పోలీసులు

TG: SIB మాజీ ఓఎస్‌డీ ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేయాలని హైకోర్టులో పోలీసులు కౌంటర్ పిటిషన్ వేశారు. స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్రాంచిలో SOT అనే ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసింది ప్రభాకర్ రావే అన్నారు. ఫోన్ ట్యాపింగే ప్రధాన లక్ష్యంగా SOT పనిచేసిందన్నారు. ఉన్నత అధికారిగా పదవీ విరమణ పొందిన వ్యక్తి కూడా చట్టపరమైన దర్యాప్తునకు సహకరించడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.
Similar News
News April 23, 2025
పహల్‌గామ్@మినీ స్విట్జర్లాండ్.. తెలుగు సినిమాల షూటింగ్

ఉగ్రవాదుల నరమేధంతో పహల్‌గామ్ పేరు దేశవ్యాప్తంగా విన్పిస్తోంది. ఇక్కడి ప్రకృతి అందాల వల్ల దీనికి మినీ స్విట్జర్లాండ్ అని పేరు వచ్చింది. కాగా, పహల్‌గామ్ అద్భుతమైన లొకేషన్లలో అల్లుఅర్జున్ ‘నా పేరు సూర్య’, నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ ‘పెళ్లి సందD’, విజయ్ దేవరకొండ ‘ఖుషీ’ సినిమాల షూటింగ్ జరిగింది. స్విట్జర్లాండ్‌ను తలపించే అందాలు, బడ్జెట్ కారణాల రీత్యా నిర్మాతలు ఇక్కడ షూటింగ్‌కు మొగ్గు చూపుతుంటారు.
News April 23, 2025
మోదీ అధ్యక్షతన కీలక సమావేశం ప్రారంభం

పహల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోదీ నివాసంలో భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. దీనికి కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, జైశంకర్, భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై వారు చర్చించనున్నారు.
News April 23, 2025
నరకకూపంలా మారుతున్న కశ్మీర్: సల్మాన్

ఉగ్రవాదుల దాడితో స్వర్గంలాంటి జమ్మూ కశ్మీర్ నరకంలా మారుతోందని బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. పహల్‌గామ్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. అమాయక ప్రజల మృతికి సంతాపం తెలియజేశారు. మరోవైపు టీమ్ ఇండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ కూడా పహల్‌గామ్ దాడిని ఖండించారు. మతం పేరుతో ఇలాంటి విధ్వంసాలు సృష్టించడం సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.