News April 7, 2025

బిగ్‌బాస్ సీజన్-9కు బాలయ్య హోస్ట్?

image

టీవీ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ తెలుగులో 8 సీజన్లు పూర్తి చేసుకుంది. త్వరలో తొమ్మిదో సీజన్ ప్రారంభం కానుంది. ఈసారి అక్కినేని నాగార్జున హోస్ట్‌గా ఉండకపోవచ్చని సమాచారం. తొమ్మిదో సీజన్‌కు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆయనతో చర్చలు జరిపినట్లు టాక్. దీనిపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. మరి ఈ షోను ఎవరు హోస్ట్ చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి.

Similar News

News April 17, 2025

ఆ ప్లేయర్లకు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్?

image

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో యువ ఆటగాళ్లు చోటు దక్కించుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జాతీయ జట్టులో సత్తా చాటిన అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణాకు కాంట్రాక్ట్ దక్కవచ్చని క్రిక్ బజ్ కథనం పేర్కొంది. అభిషేక్‌కు సీ-గ్రేడ్‌లో చోటు దక్కవచ్చని అభిప్రాయపడింది. కాగా BCCI పాలసీ ప్రకారం కాంట్రాక్ట్‌లో చోటు దక్కాలంటే ప్లేయర్ కనీసం 3 టెస్టులు లేదా 8 వన్డేలు లేదా 10 టీ20Iలు ఆడి ఉండాలి.

News April 17, 2025

చిన్నారుల భవిష్యత్తుకు అండగా ఉంటాం: సచిన్

image

చిన్నారుల భవిష్యత్తుకు అండగా నిలిచేందుకు సచిన్ ఫౌండేషన్, గేట్స్ ఫౌండేషన్ చేతులు కలిపాయి. మేఘాలయ ప్రభుత్వ భాగస్వామ్యంతో రెండు సంస్థలు పనిచేయనున్నాయి. ఈ మేరకు క్రికెట్ దిగ్గజం సచిన్ ట్వీట్ చేశారు. మూలాలపై దృష్టి పెట్టినప్పుడే నిజమైన మార్పు వస్తుందన్న విషయం మేఘాలయా పర్యటనతో అర్థమైందన్నారు. పిల్లల ఆత్మస్థైర్యం, లోకల్ టీమ్స్ నిబద్ధత ఈ ప్రయాణంలో తమకు స్ఫూర్తినిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

News April 17, 2025

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: రేపు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA అంచనా వేసింది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ఏలూరు, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. మరోవైపు అల్లూరి జిల్లా కూనవరం, చింతూరు మండలాల్లో రేపు తీవ్రమైన వడగాలులు వీచే ప్రభావం ఉందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

error: Content is protected !!