News April 7, 2025
మీరట్ మర్డర్ కేసులో మరో బిగ్ ట్విస్ట్

మీరట్ మర్డర్ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. జైలులో ఉన్న ప్రధాన నిందితురాలు ముస్కాన్ రస్తోగి గర్భవతిగా నిర్ధారణ అయ్యింది. జైలులో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా ప్రెగ్నెంట్ అని తేలింది. కాగా మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్‌పుత్‌ను అతడి భార్య ముస్కాన్ ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాతో కలిసి హత్య చేసిన విషయం తెలిసిందే. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి డ్రమ్ములో పెట్టి సిమెంట్‌తో కప్పేశారు.
Similar News
News April 18, 2025
మోదీ పర్యటన.. ఏర్పాట్ల పర్యవేక్షణకు మంత్రులతో కమిటీ

AP: PM మోదీ మే 2న అమరావతికి రానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. దాదాపు 5 లక్షల మంది ప్రజలు కూర్చునేలా సభా ప్రాంగణం కోసం 100 ఎకరాలు, పార్కింగ్ కోసం 250 ఎకరాలను సిద్ధం చేస్తున్నారు. ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రభుత్వం మంత్రులతో కమిటీని నియమించింది. అందులో లోకేశ్, పయ్యావుల, నారాయణ, సత్యకుమార్, నాదెండ్ల, రవీంద్ర ఉన్నారు. నోడల్ అధికారిగా IAS వీరపాండ్యన్‌ను నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది.
News April 18, 2025
అతడి ప్రశాంతత వల్ల మాపై ఒత్తిడి తగ్గింది: భువనేశ్వర్

RCB కెప్టెన్ రజత్ పాటీదార్ నాయకత్వ బాధ్యతల్ని అద్భుతంగా నిర్వర్తిస్తున్నారని ఆ జట్టు బౌలర్ భువనేశ్వర్ కొనియాడారు. ‘రజత్ చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఈ ఫార్మాట్‌లో అలా ఉండటం చాలా కీలకం. కొంతమంది ఒక మ్యాచ్ కోల్పోగానే టెన్షన్ పడిపోతారు. కానీ రజత్ జయాపజయాల్ని సమానంగా తీసుకుంటాడు. ఓడినప్పుడు ఎలా ఉన్నాడో, గెలిచినప్పుడూ అలాగే ఉన్నాడు. అతడి ప్రశాంతత కారణంగా మాపై ఒత్తిడి తగ్గింది’ అని తెలిపారు.
News April 18, 2025
జేఈఈ మెయిన్ ‘కీ’ విడుదల

జేఈఈ మెయిన్-2025 సెషన్-2 ఫైనల్ ‘కీ’ని ఎట్టకేలకు NTA విడుదల చేసింది. <