News April 7, 2025
బీజేపీ సంచలనం.. విరాళాల్లో టాప్

2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జాతీయ పార్టీలు పొందిన విరాళాలను ADR వెల్లడించింది. అన్ని పార్టీలకు రూ.2544.27 కోట్ల ఫండ్స్ రాగా, అందులో ఒక్క బీజేపీకే రూ.2,243 కోట్లు వచ్చాయి. మొత్తం విరాళాల్లో ఆ పార్టీకే 88శాతం వచ్చాయి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రూ.281.48 కోట్ల విరాళం పొందింది. AAP, సీపీఎం, నేషనల్ పీపుల్స్ లాంటి పార్టీలకు తక్కువ విరాళాలు రాగా, తమకు విరాళాలు రాలేదని బీఎస్పీ ప్రకటించింది.
Similar News
News September 14, 2025
బాలయ్య తరఫున సీఎంకు రూ.50 లక్షల చెక్కు అందజేత

TG: భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన కామారెడ్డి సహా ఇతర ప్రాంతాల రైతులకు అండగా నిలిచేందుకు CMRFకు నందమూరి బాలయ్య రూ.50 లక్షల పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు చెక్కును ఆయన తరఫున చిన్న కూతురు తేజస్విని సీఎం రేవంత్‌కు అందజేశారు. ఇటీవల విరాళం ప్రకటించిన సందర్భంగా భవిష్యత్తులోనూ తన వంతుగా ఇలాంటి సహాయాలు చేస్తానని బాలయ్య పేర్కొన్నారు.
News September 13, 2025
‘మిరాయ్’ ఐడియా అప్పుడే పుట్టింది: దర్శకుడు కార్తీక్

‘మిరాయ్’ మూవీ ఐడియా 2015-16లో పుట్టిందని దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని చెప్పారు. చనిపోయిన తన ఫ్రెండ్ అస్థికలు కలిపేందుకు రామేశ్వరం వెళ్తున్న సమయంలో కథకు బీజం పడిందని పేర్కొన్నారు. ఆ సమయంలో గద్ద తనతో పాటు ట్రావెల్ చేస్తున్నట్లు అనిపించిందని, అలా కథ పుట్టిందన్నారు. మిరాయ్ అనేది జపనీస్ పదమని, దానికి అర్థం ఫ్యూచర్ అని తెలిపారు. ఈ మూవీ కథ రాసేందుకు 5-8 ఏళ్లు పట్టిందన్నారు.
News September 13, 2025
వైద్యులపై దాడి చేస్తే కఠిన చర్యలు: సత్యకుమార్

AP: చికిత్స విషయంలో చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో శుక్రవారం అర్ధరాత్రి డాక్టర్లు, సిబ్బందిపై కొందరు దాడి చేయడాన్ని మంత్రి సత్యకుమార్ ఖండించారు. వైద్యులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ‘స్టాఫ్ వ్యవహారశైలిలో లోపాలు ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి. వారిపై దాడులు చేసి వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించవద్దు. ఇది సరైంది కాదు’ అని Xలో పేర్కొన్నారు.