News April 7, 2025

సంక్షేమ వసతి గృహాలలో అంబేడ్కర్ ఉత్సవాలు నిర్వహించాలి

image

శ్రీ సత్యసాయి జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో ఏప్రిల్ 14వ తేదీ అంబేడ్కర్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని కలెక్టరేట్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని వసతి గృహాలలో జయంతి వేడుకలు ఏర్పాట్లకు సన్నాహాలు చేయాలన్నారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News April 8, 2025

ఈ నెల 10-14 వరకు కామారెడ్డిలో 163 సెక్షన్: SP

image

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 10-14 వరకు 163 (BNSS) సెక్షన్ అమలులో ఉంటుందని SP రాజేశ్ చంద్ర తెలిపారు. జిల్లాలో సమావేశాలు, ర్యాలీలకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. చట్టవిరుద్ధమైన ఘటనలు జరగకుండా నిరోధించడానికి ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు  సహకరించాలని కోరారు.

News April 8, 2025

పాలమూరు: కంకాళీ భవానీ ప్రత్యేకత

image

పాలమూరులో బంజారా ప్రజలు ప్రధానంగా ఏడుగురు భవాని దేవతలను పూజిస్తారు. వారిలో కంకాళీ భవానీ ఒకరు. కంకాళీ భవానీ బంజారా ప్రజలకు శక్తిని, ధైర్యాన్ని, రక్షణను ప్రసాదిస్తుందని నమ్ముతారు.బంజారాల సంస్కృతిలో కంకాళీ భవానీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. బంజారా ప్రజలు జరుపుకునే అనేక పండుగలు, ఉత్సవాల్లో కంకాళీ భవానీకి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. భజనలతో ఆరాధిస్తారు. ఈ వేడుకలు వారి జీవితంలో ముఖ్యమైన భాగంగా ఉంటాయి.

News April 8, 2025

NLG: పీఎం ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు గడువు పెంపు

image

ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 15 వరకు గడువు పొడిగించినట్లు నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ పథకానికి ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.5 వేలు ఇస్తారని, 12 నెలల ఇంటర్న్ షిప్ సమయంలో 6 నెలల ఉద్యోగ శిక్షణ ఉంటుందన్నారు. pminternship.mca.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు టోల్ నంబర్ 1800 11 6090 ను సంప్రదించాలని సూచించారు.-SHARE IT..

error: Content is protected !!