News April 8, 2025

పడుకునే ముందు వీటిని తింటున్నారా?

image

రాత్రి పడుకునే ముందు కొన్ని ఆహార పదార్థాలు తింటే నిద్రకు ఆటంకం కలుగుతుంది. నిద్ర, ఆరోగ్యానికి హాని కలిగించే ఆహారం తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. వైట్ బ్రెడ్‌తో చేసే శాండ్ విచ్, పిజ్జా తింటే కడుపులో మంట పెరిగి నిద్రకు ఆటంకం కలుగుతుంది. బిర్యానీ, స్వీట్లు, బర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ద్రాక్ష, ఆరెంజ్, నిమ్మకాయలు తినకూడదు. కెఫిన్ ఉత్పత్తులకు దూరంగా ఉండటం మేలు. రాత్రి ఆహారం 7 గంటలలోపు తినడం ఉత్తమం.

Similar News

News April 8, 2025

ఆ రూల్‌ మార్చాలి.. భారత క్రికెటర్ అసహనం

image

MI, RCB మ్యాచ్‌‌పై IND క్రికెటర్ విహారి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘RCB ఇన్నింగ్స్ లాస్ట్ బాల్‌కు జితేశ్‌శర్మను అంపైర్ LBWగా ప్రకటించారు. రివ్యూ తీసుకోగా నాటౌట్‌ అని తేలింది. ఆ బంతికి పరుగు తీసినా రూల్ కారణంగా కౌంట్ అవ్వలేదు. ఒకవేళ రెండో ఇన్నింగ్స్‌లో లాస్ట్ బాల్‌‌కు 2 రన్స్ చేయాల్సిన సమయంలో ఇలా జరిగితే పరిస్థితేంటి? అంపైర్ నిర్ణయంతో ఫలితం మారేది. ఇప్పటికైనా ఈ రూల్ మార్చాలి’ అని అసహనం వ్యక్తం చేశారు.

News April 8, 2025

ముంబై పర్యటనకు కందుల దుర్గేశ్

image

AP: పర్యాటక శాఖలో పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి కందుల దుర్గేశ్ ఈ నెల 9, 10 తేదీల్లో ముంబైలో పర్యటించనున్నారు. పోవై లేక్‌లో జరిగే దక్షిణాసియా 20వ హోటల్ ఇన్వెస్ట్‌మెంట్ కాన్ఫరెన్స్ వర్క్‌షాప్‌లో పాల్గొననున్నారు. ఆతిథ్య రంగంలో పెట్టుబడుల అవకాశాలు, రాయితీలు వంటివి వివరించి ఇన్వెస్టర్లను ఆహ్వానించనున్నారు. మంత్రితో పాటు పర్యాటక శాఖ సెక్రటరీ అజయ్ జైన్, టూరిజం ఎండీ ఆమ్రపాలి వెళ్లనున్నారు.

News April 8, 2025

జంట పేలుళ్ల కేసు.. హైకోర్టు సంచలన తీర్పు

image

TG: దిల్‌సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో HC సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష విధించింది. దోషులు తహసీన్ అక్తర్, భక్తల్, అజాబ్, అసుదుల్లా అక్తర్, రెహ్మాన్‌కు గతంలో NIA కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడం సరైనదేనని పేర్కొంది. 2013లో జరిగిన వరుస పేలుళ్ల ఘటనలో 18 మంది మరణించగా 131 మంది గాయపడ్డారు. కాగా ఈ దాడుల ప్రధాన సూత్రధారుడు రియాజ్ భత్కల్ ఇంకా పరారీలోనే ఉన్నాడు.

error: Content is protected !!