News April 8, 2025
NGKL: దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుదారుల సమస్యలపై సకాలంలో తగిన సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ అన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) పి అమరేందర్, ఏఓ చంద్రశేఖర్, సూపరిండెంటెంట్లు, అధికారులు ఉన్నారు.
Similar News
News September 16, 2025
డ్రగ్స్ నియంత్రణకు విస్తృత చర్యలు తీసుకోవాలి: అదనపు కలెక్టర్

డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన పెంచేందుకు విస్తృత ప్రచారం అవసరమని PDPL అదనపు కలెక్టర్ వేణు పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణపై సోమవారం జరిగిన జిల్లా నార్కోటిక్ సమావేశంలో శాఖల సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యాలయాల్లో అవగాహన కార్యక్రమాలు, గంజాయి సాగు గుర్తించి నివారణ, GDKలో డీ-అడిక్షన్ కేంద్రంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
News September 16, 2025
మంచిర్యాల జిల్లా వర్షపాతం వివరాలు

గడిచిన 24 గంటల్లో మంచిర్యాల జిల్లాలో 23.7మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా లక్షెట్టిపేట మండలంలో 84మి.మీ నమోదు కాగా.. జన్నారంలో 6.8, దండేపల్లి 44.2, హాజీపూర్ 78.2, కాసిపేట 19.8, తాండూర్ 17.4, భీమిని12.4, కన్నేపల్లి 2.6, వేమనపల్లి 14.6, నెన్నల 4.8, బెల్లంపల్లి 20.4, మందమర్రి 16.2, మంచిర్యాల 14.2, నస్పూర్ 11.2, జైపూర్ 10.8, భీమారం 2.4, చెన్నూర్ 24.8, కోటపల్లిలో 28.6మి.మీ నమోదైంది.
News September 16, 2025
‘ఆరోగ్యశ్రీ’ బంద్.. చర్చలకు అంగీకరించని సర్కార్

TG: ఆరోగ్యశ్రీ సేవల బంద్‌కు పిలుపునిచ్చిన ప్రైవేట్ ఆసుపత్రుల సంఘాలతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘ఇప్పటికే ₹140 కోట్ల బకాయిల్లో ₹100 కోట్లు విడుదలయ్యాయి. 150 కార్పొరేట్ ఆసుపత్రుల్లో సేవలు కొనసాగుతాయి. ఎమర్జెన్సీ సేవలు అందుతాయి. మిగతా 330 చిన్న, మధ్య తరహా ఆసుపత్రులు ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నాయి’ అని హెల్త్ మినిస్టర్ కార్యాలయ అధికారి Way2Newsకు తెలిపారు.