News April 8, 2025

యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయ వివరాలు

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి సోమవారం నిత్య ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. కళ్యాణ కట్ట రూ.63,000, ప్రసాద విక్రయాలు రూ.6,79,690, VIP దర్శనాలు రూ.1,65,000, బ్రేక్ దర్శనాలు రూ.62,100, కార్ పార్కింగ్ రూ.2,25,000, యాదరుషి నిలయం రూ.55,360, ప్రధాన బుకింగ్ రూ.96,450, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.19,44,856 ఆదాయం వచ్చింది.

Similar News

News November 17, 2025

కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. వణికిపోతున్న హైదరాబాదీలు

image

హైదరాబాద్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చలి తీవ్రత పెరుగుతోంది. మారేడుపల్లిలో ఆదివారం కనిష్ఠ ఉష్ణోగ్రత 11.2℃గా నమోదైంది. అటు బహదూర్‌పుర, బండ్లగూడ, చార్మినార్, నాంపల్లి, ఆసిఫ్‌నగర్, హిమాయత్‌నగర్ 13.2, తిరుమలగిరి 13.6, గోల్కొండ, ముషీరాబాద్ 14.4, షేక్‌పేట్ 15.2, అమీర్‌పేట్, ఖైరతాబాద్ 15.6, సికింద్రాబాద్లో 16℃గా నమోదైంది.

News November 17, 2025

తగ్గిన రాజన్న కళ్యాణం టికెట్లు.. నిరాశలో భక్తులు

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రంలో స్వామివారి నిత్య కళ్యాణం టికెట్లను తగ్గించారు. గతంలో 180 టికెట్ల వరకు జారీ చేయగా, ప్రస్తుతం వాటి సంఖ్యను సగానికి తగ్గించారు. దీంతో శ్రీ స్వామివారి కళ్యాణ సేవలో పాల్గొనడానికి వచ్చిన భక్తులకు నిరాశ మిగులుతోంది. తగినంత స్థలం లేకపోవడం వల్లనే టికెట్లు తగ్గించినట్లు అధికారులు చెబుతున్నారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో కళ్యాణం టికెట్ల కోసం సిఫారసులు పెరిగాయి.

News November 17, 2025

దారులన్నీ భీమన్న గుడివైపే.. భక్తులతో వేములవాడ కిటకిట

image

కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా భక్తులు వేములవాడ భీమేశ్వరాలయానికి పోటెత్తారు. పవిత్రమైన కార్తీక మాసంలో రాజన్నను దర్శించుకోవాలని వేములవాడకు వచ్చిన భక్తులు అక్కడ దర్శనాలు నిలిపివేయడంతో భీమేశ్వర స్వామివారిని దర్శించుకుంటున్నారు. అభిషేక పూజల్లో పాల్గొని కోడెమొక్కులు సమర్పించుకుంటున్నారు. భీమేశ్వరాలయం వైపు భక్తుల సందడి పెరగగా, జాతర గ్రౌండ్ ప్రాంతంలో చాలావరకు తగ్గిపోయింది.