News April 8, 2025

వికారాబాద్: ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేయాలి’

image

ఎస్సీ, ఎస్టీ బాలికలను కులం పేరుతో దూషించి దాడి చేసిన వికారాబాద్ జిల్లా కొత్త గడి సొషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సాయిలతను సస్పెండ్ చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేయాలని దళిత బహుజన ఫ్రంట్, మానవహక్కుల వేదిక, ఎంవీ ఫౌండేషన్ సంస్థలు వినతిపత్రం అందజేశాయి.

Similar News

News December 31, 2025

కోర్టు మానిటరింగ్ సెల్ ద్వారా వేగవంతమైన శిక్షలు: జిల్లా ఎస్పీ

image

కోర్టు మానిటరింగ్ సెల్ ద్వారా వేగవంతమైన దర్యాప్తుతో త్వరితగతిన శిక్షలు సాధ్యమయ్యాయని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. 11 తీవ్రమైన నేరాల కేసులలో 16 మంది నిందితులకు జీవిత ఖైదు శిక్షలు పడినట్లు తెలిపారు. మరో 3 కేసుల్లో 4 మంది నిందితులకు 10 సంవత్సరాలకు పైగా శిక్షలు పడ్డాయన్నారు. జిల్లాలో 2023లో 304 కేసుల్లో, 2024లో 304 కేసుల్లో, 2025లో 314 కేసుల్లో శిక్షలు విధించబడ్డాయన్నారు.

News December 31, 2025

కామారెడ్డి: నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలపై చర్యలు

image

కామారెడ్డి జిల్లాలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా రవాణా అధికారి ఆదేశాల మేరకు ఆటో రిక్షాలు, మినీ క్యాబ్‌లపై విస్తృత తనిఖీలు నిర్వహించారు. బాన్సువాడ, పిట్లం, తాడ్వాయి, కామారెడ్డి ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాహనాలను గుర్తించి సీజ్ చేశారు.

News December 31, 2025

మోడర్న్ వెపన్స్ కొనుగోలుకు రూ.4,666కోట్ల ఒప్పందాలు

image

రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. తాజాగా రూ.4,666Crతో క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్ కార్బైన్స్, హెవీ వెయిట్ టార్పడోస్ కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు భారత్ ఫోర్జ్ లిమిటెడ్, PLR సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లతో ఒప్పందం కుదుర్చుకుంది. 2030 నాటికి ఇవి డిఫెన్స్‌కు అందనున్నాయి. కాగా 2025-26 వార్షిక ఏడాదిలో రక్షణ రంగానికి కేంద్రం రూ.1,82,492 కోట్లను కేటాయించింది.