News April 8, 2025
నిజామాబాద్: ఆకట్టుకున్న పారా గ్లైడింగ్ విన్యాసాలు

గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సోమవారం సాయంత్రం ఆర్మీ అధికారుల నేతృత్వంలో పారా గ్లైడింగ్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. 250వ ఏఓసీ కార్ప్స్ డే సందర్భంగా సికింద్రాబాద్ ఆర్మీ కంటోన్మెంట్ ఆధ్వర్యంలో పారా మోటార్ ఎక్స్ పెడిషన్-2025 యాత్రను చేపట్టారు. ఢిల్లీ నుంచి ప్రారంభమైన యాత్ర ఆగ్రా, కాన్పూర్, ఝాన్సీ, సాగర్, జబల్పూర్, పుల్గాంల మీదుగా సాగుతూ నిజామాబాద్ నగరానికి చేరుకుంది.
Similar News
News April 8, 2025
NZB: అనుముల ఇంటెలిజెన్స్‌తో రాష్ట్రానికి ప్రమాదం: కవిత

అనుముల ఇంటెలిజెన్స్‌తో రాష్ట్రానికి ప్రమాదం ఉందని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో చాలా ప్రమాదముందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు.. అనుముల ఇంటెలిజెన్స్ అని ఎద్దేవా చేశారు. అనుముల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితే తప్పా రాష్ట్రం బాగుపడే పరిస్థితి కనిపించడం లేదన్నారు.
News April 8, 2025
టీయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

తెలంగాణ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్సిటీలో మొత్తం 89 పోస్టులకు గానూ 48 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఇంకా 41 ఖాళీలు ఉన్నాయి. అకడమిక్ రికార్డ్, పరిశోధనలు, విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యం, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఈ పోస్టుల్లో ఎన్ని భర్తీ చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.
News April 8, 2025
నిజామాబాద్‌లో రైలు ఢీకొని వ్యక్తి మృతి

రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన డిచ్‌పల్లి స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపిన వివరాలు.. సోమవారం రాత్రి డిచ్పల్లి రైల్వే స్టేషన్ ప్రాంతంలో రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వయసు సుమారు 30-35 ఏళ్లు ఉండొచ్చని అంచనా వేశారు. వివరాలు తెలిసిన వారు 8712658591 నంబరును సంప్రదించాలన్నారు.