News April 8, 2025
మహబూబాబాద్: అంబేడ్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం

ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పేద విద్యార్థులకు అందించే అంబేడ్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మహబూబాబాద్ జిల్లా ఎస్సీ కులాల సంక్షేమాధికారి నరసింహస్వామి తెలిపారు. తెలంగాణకు చెందిన ఎస్సీ కుల విద్యార్థులు రూ.5 లక్షల ఆదాయం మించకుండా పీజీలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనవారు దీనికి అర్హులన్నారు. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 19 వరకు అవకాశం ఉందన్నారు.
Similar News
News March 2, 2026
కరీంనగర్: SU డిగ్రీ పరీక్ష ఫీజు నోటిఫికేషన్ విడుదల

SU పరిధిలోని బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ కోర్సుల 2, 4, 6వ సెమిస్టర్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదలైంది. అపరాధ రుసుం లేకుండా మార్చి 13 వరకు, రూ.300 ఆలస్య రుసుముతో మార్చి 18 వరకు ఫీజు చెల్లించవచ్చని పరీక్షల నియంత్రణ అధికారి డా. సురేశ్ కుమార్ తెలిపారు. మరిన్ని వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్ చూడాలని లేదా సంబంధిత కళాశాలల్లో సంప్రదించాలని ఆయన సూచించారు.
News March 2, 2026
పరీక్షలంటే భయం వద్దు: కలెక్టర్

పదో తరగతి విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా, ప్రశాంత చిత్తంతో పరీక్షలకు సిద్ధం కావాలని కలెక్టర్ అనుదీప్ పిలుపునిచ్చారు. సోమవారం ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక మోటివేషన్ కార్యక్రమంలో మాట్లాడారు.పరీక్షల పట్ల భయం పెంచుకుంటే ఉన్న సమయాన్ని వృథా చేసుకోవడమే కాకుండా, తెలిసిన విషయాలను కూడా మర్చిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
News March 2, 2026
ఇరాన్‌లో ఎంత మంది చనిపోయారంటే..

మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న యుద్ధం మారణహోమమే సృష్టిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేస్తున్న దాడుల కారణంగా ఇరాన్‌లో ఇప్పటి వరకు 555 మంది మరణించినట్లు ఆ దేశంలోని రెడ్ క్రెసెంట్ సంస్థ ప్రకటించింది. మొత్తం 131 నివాసాలను టార్గెట్ చేసినట్లు వెల్లడించింది. గాయపడిన వారి వివరాలను మాత్రం చెప్పలేదు. శనివారం ప్రకటించిన సమాచారం ప్రకారం.. 201 మంది చనిపోగా, 747 మంది గాయపడ్డారు.


