News April 8, 2025
శ్రీసత్యసాయి: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. సోమవారం రాత్రి పెనుకొండ లోని డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటిస్తున్న సందర్భంగా రామగిరి మండలంలోని పాపిరెడ్డిపల్లిలో నిబంధనల ప్రకారం బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. నాయకులు జన సమీకరణ చేయరాదన్నారు.
Similar News
News July 5, 2025
HYD: అమెరికాలో మన పోలీస్‌కు ‘GOLD’ మెడల్

USలోని అల్బామాలో జరుగుతోన్న వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్‌లో HYD నివాసి సత్తాచాటారు. లక్డీకాపూల్‌లోని DGP ఆఫీస్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న కృష్ణారావు(IGP స్పోర్ట్స్) ఇండోర్ రోయింగ్ గేమ్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. జులై 6 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. ఈ గేమ్స్‌లో 80 దేశాల నుంచి దాదాపు 8500 మంది పాల్గొంటున్నారు. 50+ విభాగంలో మన కృష్ణారావు ఈ ఘనత సాధించడం గర్వకారణం.
News July 5, 2025
ఇలా అయితే అప్పన్న భక్తులు నడిచేదెలా?

సింహాచలం గిరిప్రదక్షిణను అధికారులు ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ భక్తులకు కొన్నిచోట్ల ఇబ్బంది తప్పేలా లేదు. పెదగదిలి నుంచి హనుమంతువాక వరకు సర్వీసు రోడ్డులో కాంక్రీటు పిక్క తేలి ఉంది. చెప్పులు లేకుండా నడిచే లక్షలాది అప్పన్న భక్తుల కాళ్లకు పిక్క గుచ్చుకునే ప్రమాదం ఉంది. అధికారులు తక్షణమే పరిస్థితిని చక్కదిద్దాలని పలువురు కోరుతున్నారు. గతేడాది కూడా కొన్ని చోట్ల ఇలాంటి పరిస్థితే భక్తులకు ఎదురయ్యింది.
News July 5, 2025
మెగా PTM 2.0పై అపోహలు వద్దు: పాఠశాల విద్యాశాఖ

AP: ఈనెల 10న మెగా PTM 2.0లో (పేరెంట్స్, టీచర్స్ మీటింగ్) 2.28cr+ మంది పాల్గొని గిన్నిస్ రికార్డు సృష్టించాలని సమగ్ర శిక్షా పథక రాష్ట్ర సంచాలకుడు B.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. రికార్డు కోసం మాత్రమే విట్నెస్ నమోదు అని, దీని వెనుక వేరే ఏ ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. HMలు, టీచర్లు అపోహలు వీడాలని సూచించారు. ప్రభుత్వోద్యోగులు, పేరెంట్స్ కాకుండా ఎవరితోనైనా సంతకం చేయించొచ్చని పేర్కొన్నారు.