News April 8, 2025
మత్స్య శాఖ సహాయ సంచాలకుడి బాధ్యతల స్వీకరణ

బాపట్ల మత్స్య శాఖ సంయుక్త సంచాలకుడిగా కే శ్రీనివాస నాయక్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. తిరుపతి జిల్లాలో మత్స్యశాఖ ఉప డైరెక్టర్‌గా పనిచేస్తూ ఆయన పదోన్నతిపై జిల్లాకు మత్స్యశాఖ సంయుక్త డైరెక్టర్‌గా నియమితులయ్యారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన జిల్లా కలెక్టర్ వెంకట మురళి, జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News January 17, 2026
వరంగల్: గ్రూప్-3లో ఎంపికైన అభ్యర్థికి నియామక ఉత్తర్వులు: వీసీ

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టీజీపీఎస్సీ గ్రూప్-3 ఉద్యోగ నియామక పరీక్షలో అర్హత పొందిన అభ్యర్థికి వరంగల్ కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ఉద్యోగ నియామకం చేస్తూ విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ రమేశ్ రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు అందజేశారు. ఎగ్జామినేషన్ కంట్రోలర్ డాక్టర్ మల్లేశ్వర్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
News January 17, 2026
అందరినీ అలరించడం చిరంజీవికే సాధ్యం: వీవీ వినాయక్

ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ శుక్రవారం తన స్వగ్రామమైన చాగల్లులో పర్యటించారు. సంక్రాంతి సెలవుల్లో స్నేహితులతో కలిసి సొంత థియేటర్‌లో ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాన్ని వీక్షించారు. అన్ని వర్గాలను ఆకట్టుకోవడమే మెగాస్టార్ ఆకాంక్ష అని ఆయన కొనియాడారు. చిరంజీవి ఫ్యామిలీ నుంచి మరిన్ని మంచి చిత్రాలు రావాలని ఆకాంక్షించారు. పండుగ పూట వినాయక్ రాకతో గ్రామంలో సందడి నెలకొంది.
News January 17, 2026
ఆ ప్లేయర్‌ను చివరి వన్డేలోనైనా ఆడించండి: అశ్విన్

న్యూజిలాండ్‌తో రెండు వన్డేలకు బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ను బెంచ్‌కే పరిమితం చేయడంపై మాజీ క్రికెటర్ అశ్విన్ అసహనం వ్యక్తం చేశారు. కనీసం మూడో వన్డేలోనైనా అతడిని ఆడించాలని సూచించారు. అర్ష్‌దీప్ ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాడని, జట్టు విజయాల్లో భాగమయ్యాడని తెలిపారు. అయినా టీమ్‌లో స్థానం కోసం పోరాడుతున్నాడని చెప్పారు. బ్యాటర్ల విషయంలో ఇలా జరగదని, ప్రతిసారీ బౌలర్లే బలవుతున్నారని పేర్కొన్నారు.


