News April 8, 2025

మేడ్చల్: ప్రజావాణిలో 82 ఫిర్యాదుల స్వీకరణ

image

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యల అర్జీలను డీఆర్ఓ హరిప్రియతో కలిసి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి స్వీకరించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 82 ఫిర్యాదులు అందాయన్నారు. సంబంధిత శాఖల జిల్లా అధికారులు స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించారు.

Similar News

News July 6, 2025

వరల్డ్‌లో HYD బిర్యానీ ది BEST!

image

HYD బిర్యానీ.. ఈ పేరు ఒక ఎమోషన్. దీని రుచి వరల్డ్ ఫేమస్‌. సిటీలో దమ్ బిర్యానీ‌ తింటే ఫిదా అవ్వాల్సిందే. మాంసానికి మసాలా అంటించి, పెరుగు, నెయ్యి, నిమ్మకాయ రసం బాగా పట్టిస్తారు. బాస్మతి రైస్‌తో మాంసాన్ని ఉడికించి బిర్యానీ రెడీ చేస్తారు. ఫైనల్‌గా కొత్తిమీర, వేయించిన ఉల్లిపాయలు ఈ వంటకానికి మరింత రుచినిస్తాయి. ఇన్ని మిశ్రమాలతో చేసే HYD బిర్యానీ వరల్డ్ బెస్ట్‌గా నిలవడం విశేషం.

నేడు World Biryani Day

News July 6, 2025

సంగారెడ్డి జిల్లాలో ఎంపీడీఓల బదిలీలు

image

సంగారెడ్డి జిల్లా ఎంపీడీఓ సుధాకర్, మాల్సుర్ ఇతర జిల్లాలకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఇతర జిల్లాలో పని చేస్తున్న చంద్రశేఖర్, మంజుల, శారద దేవీ జిల్లాకు రానున్నట్లు పేర్కొన్నారు. బదిలీ అయిన ఎంపీడీఓలు తక్షణమే విధుల్లో చేరాలని సూచించారు.

News July 6, 2025

ప్రేమజంట ఆత్మహత్య!

image

AP: ప్రకాశం (D) కొమరోలు(M) అక్కపల్లెలో విషాదం నెలకొంది. పెద్దలు తమ వివాహానికి నిరాకరించడంతో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఇవాళ తెల్లవారుజామున యువతి, యువకుడు మృతదేహాలుగా చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. మృతులు నంద్యాల(D) ప్యాపిలి(M) మాధవరం వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.