News March 26, 2024

మయాంక్‌కు రోహిత్ ఫ్లయింగ్ కిస్

image

ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ.. మయాంక్ అగర్వాల్‌ను ఆటపట్టించారు. ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ సందర్భంగా మయాంక్‌కు ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. ఇటీవల కోల్‌కతాతో మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్‌ను ఔట్ చేసిన అనంతరం బౌలర్ హర్షిత్ రానా.. మయాంక్ దగ్గరకు వెళ్లి ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన విషయం తెలిసిందే. రోహిత్.. ఆ ఘటనను గుర్తు చేస్తూ ఇమిటేట్ చేశారు.

Similar News

News October 4, 2024

ప్రజా నాయకులు ఇలా బారికేడ్ల మధ్యలో ఉంటారా?: వైసీపీ

image

AP: Dy.CM పవన్ తిరుపతి సభపై YCP విమర్శలు చేసింది. ‘ప్రజా నాయకులు ఇలా బారికేడ్ల మధ్యలో అందరికీ దూరంగా ఉంటారా? వరదల టైమ్‌లో బయటకు రాని ఈయన కొత్తగా మత రాగం ఎత్తుకున్నాడు. అసెంబ్లీలో కులమతాలకు అతీతంగా ప్రమాణం చేసి ఇప్పుడు కొత్తగా సనాతన ధర్మం డిక్లరేషన్ ఏమిటి? ప్రచారం కోసం మొన్నటిదాకా తిరుపతి లడ్డూను అవమానించారు. ఇప్పుడు రాజకీయం కోసం మత ధర్మాన్ని బారికేడ్ల మధ్యలోకి తెచ్చారు’ అని ట్వీట్ చేసింది.

News October 4, 2024

మంత్రి అలా మాట్లాడటం సిగ్గుచేటు: అశ్విని వైష్ణవ్

image

మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ మహిళా వ్యతిరేక ఆలోచనను సూచిస్తున్నాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ‘ఒక మంత్రి ఇలా సినీ ప్రముఖుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడటం సిగ్గుచేటు. ఫిల్మ్ ఇండస్ట్రీని కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుందనే దానికి ఇదే నిదర్శనం. దీనిపై రాహుల్ గాంధీ, పార్టీ అధిష్ఠానం మౌనంగా ఉండటం చూస్తుంటే వారు ఈ వ్యాఖ్యలను సమర్థిస్తున్నట్లు అర్థం అవుతోంది’ అని ట్వీట్ చేశారు.

News October 4, 2024

తొలి కృత్రిమ ఉపగ్రహం ‘స్పుత్నిక్-1’

image

ప్రపంచంలో మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్-1ను సోవియట్ యూనియన్ 1957లో సరిగ్గా ఇదే రోజున ప్రయోగించింది. భూమిచుట్టూ పరిభ్రమించిన ఈ శాటిలైట్ ప్రతి గంటకు 29,000km ప్రయాణించి, రేడియో సిగ్నల్స్‌ను ప్రసారం చేసింది. 22 రోజులు నిరంతరాయంగా పని చేసిన తర్వాత OCT 26న బ్యాటరీ అయిపోవడంతో స్పుత్నిక్-1 నుంచి సిగ్నల్స్ ఆగిపోయాయి. 1958 జనవరి 4న ఇది కాలిపోయి, తన కక్ష్యనుండి భూమి వాతావరణంపై పడిపోయింది.