News April 8, 2025
నర్వ: లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన ఎమ్మెల్యే, కలెక్టర్

నర్వ మండలం లంకాల గ్రామంలోని రేషన్ దుకాణంలో సోమవారం సన్న బియ్యం పథకాన్ని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రారంభించారు. అనంతరం రేషన్ కార్డు లబ్ధిదారులు రాములమ్మ ఇంట్లో సన్న బియ్యంతో వండిన అన్నం భోజనం చేశారు. ఈ సంధర్బంగా రాములమ్మతో మాట్లాడారు. బియ్యం ఎలా వున్నాయని, అన్న ఎలా అయిందని అడిగి తెలుసుకున్నారు. సన్న బియ్యం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
Similar News
News April 17, 2025
నోటిఫికేషన్ వచ్చిన 50 రోజుల్లో డీఎస్సీ పరీక్ష: వేపాడ

డీఎస్సీ నోటిఫికేషన్ అతి త్వరలో వెలువడనున్నట్లు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవి రావు బుధవారం పేర్కొన్నారు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత 45 రోజుల నుంచి 50 రోజుల్లో డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులందరూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
News April 17, 2025
ప్రజా విధానాల రూపకల్పనలో గ్రాడ్యుయేట్లదే కీలకపాత్ర: రామ్మోహన్ నాయుడు

ప్రజా విధానాల రూపకల్పనలో గ్రాడ్యుయేట్ల కీలకపాత్ర అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. పటాన్ చెరు మండలం రుద్రారం సమీపంలోని గీతం యూనివర్సిటీలో విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రధాన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జీవితంలో ఎదిగేందుకు షార్ట్ కట్స్ ఉండవని, కష్టపడితే విజయం సాధిస్తారని చెప్పారు. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని సూచించారు.
News April 17, 2025
ఈరోజు నమాజ్ వేళలు(ఏప్రిల్ 17, గురువారం)

ఫజర్: తెల్లవారుజామున 4.45 గంటలకు
సూర్యోదయం: ఉదయం 5.59 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.16 గంటలకు
అసర్: సాయంత్రం 4.42 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.33 గంటలకు
ఇష: రాత్రి 7.47 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.