News April 8, 2025

వికారాబాద్: జిల్లాలో ఇన్‌కమ్ టాక్స్ దాడులు

image

జిల్లా పరిధిలోని ఛన్గోముల్ గ్రామంలో సోమవారం ఇన్‌కమ్ టాక్స్ అధికారి విట్టల్ రావు బృందం దాడులు నిర్వహించింది. గ్రామానికి చెందిన బేగారి ప్రభాకర్ ఇంటిని వరంగల్‌కు చెందిన పండాల రవళి అద్దెకు తీసుకొని, వ్యాపారం చేస్తున్నట్లు చూపుతూ ఫోర్జరీ సంతకాలు సృష్టించినట్లు ఆరోపణలు వచ్చాయి. అధికారులు వివరాలు సేకరించినట్లు కార్యదర్శి పరుశురాం తెలిపారు.

Similar News

News April 18, 2025

విడాకుల బాటలో మరో సెలబ్రిటీ జంట?

image

హీరోయిన్ నజ్రియా నజీమ్, ఫహాద్ ఫాజిల్ జంట విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. SMలో నజ్రియా పెట్టిన ఓ పోస్ట్ దీనికి బలం చేకూరుస్తోంది. ‘నేను డిప్రెషన్‌లోకి వెళ్లాను. ‘సూక్ష్మదర్శిని’ విజయాన్ని కూడా ఆస్వాదించలేకపోయా. ఇది చాలా కఠినమైన సమయం. పూర్తిగా కోలుకుని మళ్లీ మీ ముందుకొస్తా’ అంటూ రాసుకొచ్చారు. ఫహాద్‌తో విడాకుల వ్యవహారంతోనే ఆమె డిప్రెషన్‌లో వెళ్లారేమోనని నెటిజన్లు భావిస్తున్నారు.

News April 18, 2025

మస్క్‌తో చర్చలు.. మోదీ ట్వీట్

image

ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌తో చర్చలు జరిపినట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. సాంకేతికత, ఆవిష్కరణల రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించామని ప్రధాని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరువురి మధ్య జరిగిన విషయాలు ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ రంగాలలో భారత్, అమెరికా భాగస్వామ్యం మరింత పురోగమిస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

News April 18, 2025

సిరిసిల్ల: తెలంగాణ సాయుధ రైతన్న పోరాట వీరుడు కర్రోల్ల నర్సయ్య

image

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరుడు కర్రోళ్ల నర్సయ్య వర్థంతి నేడు. ఆయన సిరిసిల్ల నియోజకవర్గం నుంచి 1957 నుండి1962 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన కోనరావుపేట మండలం మల్కాపేట గ్రామంలో జన్మించారు. 2003లో ఏప్రిల్ 17న గుండెపోటుతో మరణించారు. నర్సయ్య భార్య దుర్గమ్మ గతంలో చనిపోయిందని, ఇద్దరు కుమారులలో ఒక కుమారుడు ఇటీవలే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు.

error: Content is protected !!