News April 8, 2025

రూ. రెండున్నర లక్షలు కొట్టేసి సారీ లెటర్ పెట్టాడు!

image

ఓ దుకాణంలో రూ.2.45 లక్షలు దోచుకున్న దొంగ, తనను క్షమించమంటూ ఓ లేఖ అక్కడ వదిలి వెళ్లాడు. ‘అప్పుల్ని తీర్చుకునేందుకు ఈ చోరీ చేస్తున్నా. రామనవమి రోజు చేస్తున్న ఈ దొంగతనానికి నన్ను క్షమించండి. నాకు కావాల్సినంత మాత్రమే తీసుకున్నా. 6 నెలల్లో తిరిగిచ్చేస్తాను. ఆ తర్వాత నన్ను అరెస్ట్ చేయించుకోండి’ అని అందులో రాశాడు. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోనీలో జరిగిన ఈ ఆసక్తికర ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Similar News

News April 17, 2025

పురుషులకు అలర్ట్.. ఈ తప్పు చేయకండి

image

ఆరోగ్యకర ఆహారం తీసుకుంటున్నా, మద్యం, సిగరెట్ అలవాట్లు మానేసినా లైంగిక సామర్థ్యం మెరుగుపడటం లేదని చాలామంది పురుషులు బాధపడుతుంటారు. అయితే విటమిన్-D లోపమూ ఇందుకు కారణమని తాజా అధ్యయనం వెల్లడించింది. ఇది బోన్స్, రోగ నిరోధక శక్తితో పాటు లైంగిక సామర్థ్యంపైనా ప్రభావం చూపుతుందని పేర్కొంది. విటమిన్-డి లెవెల్స్ తగ్గకుండా మెయింటేన్ చేయాలని సూచించింది. పూర్తి వివరాలు ఈ లింక్‌పై <>క్లిక్<<>> చేసి తెలుసుకోండి.

News April 17, 2025

ముర్షిదాబాద్ అల్లర్లపై సిట్ ఏర్పాటు

image

పశ్చిమబెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ఇటీవల జరిగిన అల్లర్లపై రాష్ట్ర పోలీసులు 9మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేశారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గత వారం అక్కడ జరిగిన ఆందోళనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో హింసకు కారకులు, తదితరాలపై ప్రభుత్వానికి సిట్ నివేదిక అందించనుంది. మరోవైపు అల్లర్లలో మృతి చెందిన ముగ్గురి కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల చొప్పున CM మమత నష్టపరిహారం ప్రకటించారు.

News April 17, 2025

రోహిత్, కోహ్లీ, బుమ్రాకు A+ కాంట్రాక్ట్?

image

రోహిత్, కోహ్లీ, బుమ్రాకు BCCI A+ కాంట్రాక్ట్ కేటాయించనున్నట్లు సమాచారం. బోర్డు వర్గాల్ని ఉటంకిస్తూ స్పోర్ట్స్‌తక్ ఈ విషయాన్ని తెలిపింది. మూడు ఫార్మాట్లలోనూ ఆడుతున్న అగ్ర క్రికెటర్లకు మాత్రమే బోర్డు A+ గ్రేడ్ కేటాయిస్తోంది. రోహిత్, కోహ్లీ ఇప్పటికే టీ20లకు వీడ్కోలు పలికారు. వన్డేలు, టెస్టులు మాత్రమే ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి A+ గ్రేడ్ దక్కుతుందా లేదా అన్న ఆసక్తి క్రికెట్ వర్గాల్లో నెలకొంది.

error: Content is protected !!