News April 8, 2025
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి: అడిషనల్ కలెక్టర్

రబీ సీజన్‌ను పురస్కరించుకొని కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సంబంధిత అధికారులతో అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ధాన్యం రాకను బట్టి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చర్యలు తీసుకోవాలని తహాశీల్దార్లను ఆదేశించారు. ప్రతి కేంద్రం పూర్తి స్థాయిలో పనిచేసే వరకు రెవెన్యూ వ్యవసాయ శాఖ, సివిల్ సప్లైఅధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు.
Similar News
News April 18, 2025
తిరుమలలో TTD ఛైర్మన్ ఆకస్మిక తనిఖీలు

AP: తిరుమలలో TTD ఛైర్మన్ BR నాయుడు ఆకస్మిక తనిఖీలు చేశారు. శ్రీవారిని దర్శించుకున్న భక్తులతో మాట్లాడి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అని అడిగి తెలుసుకున్నారు. TTD సాంకేతిక సేవల్లో కొన్ని లోపాలను ఓ భక్తుడు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు లడ్డూ, అన్నప్రసాదాలు రుచికరంగా ఉన్నాయని కొందరు తెలిపారు. అటు, దర్శన క్యూలైన్లనూ ఆయన పరిశీలించి.. భక్తులతో మర్యాదగా, సేవాభావంతో ప్రవర్తించాలని సిబ్బందిని ఆదేశించారు.
News April 18, 2025
వసతి గృహంలో మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ తనిఖీ

MBNR జిల్లా కేంద్రంలోని బాలికల గిరిజన సంక్షేమ వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి గురువారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. 9వ తరగతి విద్యార్థులతో కలెక్టర్ ముఖాముఖిగా మాట్లాడుతూ.. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. విద్యపై దృష్టి పెట్టి చదువులో బాగా రాణించాలని విద్యార్థులకు సూచించారు. విద్యతోపాటు ఇంటి దగ్గర తల్లిదండ్రులకు సహాయంగా ఉండాలని చెప్పారు.
News April 18, 2025
‘అద్భుత శిల్ప సంపద మన మెదక్’

మెదక్ జిల్లాలో ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు ఉన్నట్లు యువ చరిత్ర పరిశోధకుడు సంతోష్ తెలిపారు. అంతర్జాతీయ చారిత్రక కట్టడాల దినోత్సవం సందర్బంగా మాట్లాడుతూ.. వేల్పుగొండ తుంబురేశ్వర స్వామి ఆలయం, వెల్దుర్తి కాకతీయ కళాతోరణం, కొంటూరు మసీద్, సీఎస్ఐ చర్చి లాంటి ఎన్నో అద్భుతమైన పురాతన కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కాలగర్భంలో కలిసిపోతున్న అత్యద్భుతమైన శిల్ప సంపద మెదక్ జిల్లాలో ఉందన్నారు.