News April 8, 2025
ములుగు: ‘వేసవి క్రీడల శిక్షణకు దరఖాస్తు చేసుకోండి’

ములుగు జిల్లాలో మే 1 నుంచి నెల రోజుల పాటు నిర్వహించే వేసవి శిక్షణ శిబిరాలలో 14 ఏళ్ల బాల బాలికలకు వివిధ క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు గాను అర్హులైన వ్యాయామ ఉపాధ్యాయులు, జాతీయ స్థాయి క్రీడాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి తుల రవి తెలిపారు. శిక్షకులకు రూ.4 వేల గౌరవ వేతనం అందజేస్తామని, ఆసక్తి గల వారు ఈ నెల 15లోగా జిల్లా సంక్షేమ భవన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News February 26, 2026
గోదావరి పుష్కరాలకు పకడ్బందీగా ఏర్పాట్లు: సీతక్క

2027లో జరిగే గోదావరి పుష్కరాల కోసం ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని, ఇప్పటి నుంచే అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. గోదావరి నదిపై నాలుగు పుష్కర ఘాట్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పార్కింగ్ స్థలంపై దృష్టి సారించాలన్నారు. మరుగుదొడ్ల నిర్మాణం, ప్రత్యేక గదులు ఏర్పాటు, ప్రజల భద్రతపై చర్యలు చేపట్టాలన్నారు. పాత ఘాట్ల వద్ద అవసరమైన మరమ్మతులు చేయించాలని సూచించారు.
News February 26, 2026
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

<
News February 26, 2026
ఇందిరమ్మ ఇళ్లపై కడియం శ్రీహరి సమీక్ష

జనగామ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేసి ఒక్క ఇల్లు కూడా ల్యాప్స్ కాకుండా చూడాలని, సాగునీరు అందక ఒక్క ఎకరం ఎండిపోకూడదని అధికారులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి సూచించారు. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, అడిషనల్ కలెక్టర్ పింకేష్ కుమార్‌తో సమీక్షలో ఇళ్ల పనులు వెంటనే ప్రారంభించాలని, ప్రభుత్వ భూముల వివరాలు సేకరించాలని ఆదేశించారు.


