News April 8, 2025
మానవపాడు: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి.. కేసు నమోదు

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు మానవపాడు ఎస్సై చంద్రకాంత్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. యూపీకి ఇమ్రాన్ (24) మానవపాడు మండలం జల్లాపురం శివారులోని ఆర్టీఏ బార్డర్ చెక్పోస్ట్ సమీపంలో ఆదివారం ప్రమాదవశాత్తు లారీ కింద పడ్డాడు. చికిత్స నిమిత్తం కర్నూల్ ఆసుపత్రిలో తరలించగా, అక్కడి మృతిచెందారు. మృతుడి బాబాయ్ ఫిర్యాదుమేరకు కేసునమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
Similar News
News November 8, 2025
వేధింపులకే మా కూతురు చనిపోయింది: పేరెంట్స్

రాజస్థాన్ జైపూర్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్లో 12 ఏళ్ల <<18177948>>అమైరా సూసైడ్<<>> చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె ఆత్మహత్యకు వేధింపులే కారణమని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. ‘నన్ను స్కూలుకు పంపకండని మా కూతురు ఏడాది క్రితమే బతిమాలింది. ఆ విషయం మేము టీచర్‌కి చెప్పాం. వాళ్లు పట్టించుకోలేదు. లైంగిక అర్థాలు వచ్చేలా ఏడిపించడం, వేధించడం వల్లే మా కూతురు చనిపోయింది. వాళ్లు సమాధానం చెప్పాలి’ అని పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు.
News November 8, 2025
బుమ్రా కాదు.. వాళ్లిద్దరే డేంజర్: అశ్విన్

టీ20 ఫార్మాట్‌లో బుమ్రా కన్నా వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ ప్రమాదమని టీమ్ ఇండియా మాజీ స్పిన్నర్ అశ్విన్ అభిప్రాయపడ్డారు. ‘భారత్‌లో జరగబోయే T20 WCను గెలవాలనుకుంటే వాళ్లు చక్రవర్తి, అభిషేక్ శర్మ రూపంలోని అడ్డంకులను దాటాల్సిందే. వీరి కోసం ప్రత్యేక వ్యూహాలు రెడీ చేసుకుంటేనే ప్రత్యర్థులు గెలవగలరు. ఆసీస్ అభిషేక్ కోసం వాడుతున్న షార్ట్ బాల్ స్ట్రాటజీ బాగుంది. WCలోనూ వాళ్లు ఇదే వాడొచ్చు’ అని తెలిపారు.
News November 8, 2025
రామారెడ్డి: లోన్ పేరుతో మోసం.. రూ.1.02 లక్షల టోకరా!

ఆన్‌లైన్ మోసంలో ఓ వ్యక్తి చిక్కుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. SI రాజశేఖర్ వివరాలిలా..రామారెడ్డి (M) రెడ్డిపేట వాసి రాజు చరవాణికి వచ్చిన ముద్ర లోన్ ప్రకటన చూసి తన వివరాలు నమోదు చేయగా, ఓ వ్యక్తి ఫోన్ చేసి లోన్ ఇప్పిస్తానని నమ్మబలికాడు. లోన్ ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో బాధితుడి నుంచి 7 విడతలుగా రూ. 1,02,960 బదిలీ చేయించుకున్నాడు. మోస పోయినట్లు తెలిసి ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు SI వివరించారు.


