News April 8, 2025
బెల్లంపల్లి: ప్రభుత్వ భూమిలో ఇంటి నిర్మాణం చేపట్టిన ఇద్దరిపై కేసు

బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇల్లు నిర్మాణం చేపడుతున్న ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు 1టౌన్ SHOదేవయ్య తెలిపారు. SHO మాట్లాడుతూ..సర్వే నం.170PP ఆక్రమించి ఇల్లు కడుతున్న SK.మహబూబ్ బీ, అమానుల్లా ఖాన్ అనే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు చేశారన్నారు. దీంతో వారిపై కేసు నమోదు చేశామని SHOపేర్కొన్నారు.
Similar News
News November 6, 2025
సిరిసిల్ల: ఆఫీసర్‌కు దక్కిన అరుదైన గౌరవం..!

తంగళ్లపల్లి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నూతన ఇందిరమ్మ గృహం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ హాజరయ్యారు. కాగా, కార్యక్రమానికి అధికారులు అన్నీ ఏర్పాట్లను చేసి సిద్ధంగా ఉంచారు. ఈ క్రమంలో హాజరైన కలెక్టర్ హౌసింగ్ AE అబ్దుల్ హమీద్‌తో రిబ్బన్ కట్ చేయించి ప్రారంభోత్సవం జరిపిచండంతో ఆయన ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో ఏఈ కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
News November 6, 2025
బిహార్ అప్డేట్: 11 గంటల వరకు 27.65% పోలింగ్

బిహార్‌లో మొదటి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 27.65 శాతం పోలింగ్ నమోదైంది. కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులుదీరారు. సీఎం నితీశ్ కుమార్, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, ఆర్జేడీ నేతలు లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
News November 6, 2025
ఉపఎన్నిక ప్రచారానికి కేసీఆర్ ఇక రానట్టేనా!

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారానికి KCR రానట్లేనని పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఈ ఎన్నిక బాధ్యతను పూర్తిగా కేటీఆరే తీసుకున్నారు. ఇప్పుడు ప్రచార పర్వం రేవంత్ vs KTRగా వేడెక్కింది. తండ్రి మరణంతో 10 రోజులు ప్రచారానికి దూరంగా ఉన్న హరీశ్ రావు ఈ 3 రోజులు యాక్టివ్ కానున్నారు. KCR ఒక్కసారి రావాలని పార్టీ క్యాడర్ ఆశిస్తున్నా… గెలుస్తామనే ధీమా, అనారోగ్యం కారణంగా ఆయన వచ్చే అవకాశం కనిపించడం లేదు.


