News April 8, 2025

NRPT: మోడల్ కామన్ సర్వీస్ సెంటర్ స్థాపనకు దరఖాస్తులు ఆహ్వానం

image

రాజీవ్ యువ వికాస్ పథకం కింద మోడల్ కామన్ సర్వీస్ సెంటర్ (CSC) కేంద్రాల స్థాపనకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కామన్ సర్వీ మేనేజర్ దిలీప్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు 70% నుంచి 80% ప్రభుత్వ సబ్సిడీ అందుతుందన్నారు. దరఖాస్తులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా చేసుకోవచ్చన్నారు. ISBలో డీటీపీ, కంప్యూటర్ సెంటర్, జిరాక్స్ సెంటర్ ఎంచుకోవాలన్నారు. పూర్తి వివరాలకు స్థానిక ఎంపీడీవో అధికారిని సంప్రదించాలన్నారు.

Similar News

News April 17, 2025

ADB: యువతికు వేధింపులు.. రహీం ARREST

image

మహిళల, విద్యార్థుల రక్షణకు షీటీం నిత్యం అందుబాటులో ఉంటుందని షీటీం ఇన్‌ఛార్జ్ ఏఎస్ఐ సునీత తెలిపారు. ADBకు చెందిన యువతిని HYDలో చార్మినార్ వద్ద దుస్తుల దుకాణంలో దిగిన ఫొటోను అక్కడ పనిచేస్తున్న షేక్ రహీం మార్పింగ్ చేశాడు. దానిని ఆధారం చేసుకొని సోషల్ మీడియాలో ఆమెపై దుష్ప్రచారం చేస్తూ వేధించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని స్పెషల్ ఆపరేషన్ ద్వారా ADBకు రప్పించి అరెస్టు చేసినట్లు ASI తెలిపారు.

News April 17, 2025

GREAT.. గిన్నిస్ రికార్డు సాధించిన పెద్దపల్లి వాసి

image

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని భూంనగర్‌కు చెందిన ప్రసాద్ ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్’ రికార్డుల్లో చోటు దక్కించుకున్నారు. సంగీత వాయిద్యంలో తన అసాధారణ ప్రతిభను ప్రదర్శించి ఈ ఘనతను సాధించారు. ఇటీవల నిర్వహించిన మ్యూజిక్ ప్రదర్శనలో ప్రసాద్ ప్రతిభ చాటుతూ ప్రపంచస్థాయి గుర్తింపును పొందారు. ఆయన విజయాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు.

News April 17, 2025

ఈ రీజనింగ్ పజిల్‌కు ఆన్సర్ తెలుసా?

image

పై ఫొటోలో ఉన్న రీజనింగ్ పజిల్‌లో బోట్, రింగ్, స్టార్‌కు ఒక్కో దానికి ఒక్కో నంబర్ కేటాయించారు. దాని ఆధారంగా కుడివైపు ఆన్సర్ ఇస్తూ వచ్చారు. తొలి మూడింటి ఆధారంగా 4, 5వ దాని సమాధానాలు కనుక్కొని COMMENT చేయండి.

error: Content is protected !!