News April 8, 2025
హరీశ్ శంకర్‌తో బాలకృష్ణ మూవీ?

నందమూరి బాలకృష్ణ వరుసగా యువ దర్శకులకు అవకాశాలిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన హరీశ్ శంకర్‌తోనూ సినిమా చేయనున్నారని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ సిద్ధమైందని సమాచారం. మరోవైపు హరీశ్ రామ్ పోతినేనితోనూ ఓ సినిమా చేసేందుకు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను హరీశ్ కంప్లీట్ చేయాల్సి ఉంది.
Similar News
News April 17, 2025
క్రేజీ ప్రాజెక్టులో ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్!

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ హీరోగా ఫర్హాన్ అక్తర్ ‘డాన్ 3’ మూవీని తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్‌గా కియారా అద్వానీని తీసుకోగా ప్రెగ్నెన్సీ కారణాలతో ఆమె తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆ ఛాన్స్‌ను యంగ్ హీరోయిన్ శార్వరీ దక్కించుకున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ముంజ్య, ఆల్ఫా మూవీలతో శార్వరీ లైమ్ లైట్‌లోకి వచ్చారు.
News April 17, 2025
ప్రధాని మోదీ అధ్యక్షతన బీజేపీ కీలక సమావేశం

బీజేపీ సంస్థాగత ఎన్నికలపై ఆ పార్టీ అగ్రనేతలు PM మోదీ అధ్యక్షతన ఆయన నివాసంలో బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత కీలక సమావేశం నిర్వహించారు. ఇందులో జాతీయ అధ్యక్షుడి, పలు రాష్ట్రాలకు చీఫ్‌లను ఎన్నుకునే ప్రక్రియపై చర్చించినట్లు తెలుస్తోంది. APR 20 తర్వాత ఎప్పుడైనా జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. అటు, రాష్ట్రాల అధ్యక్షుల పేర్లు రెండు, మూడ్రోజుల్లో ప్రకటించనున్నట్లు సమాచారం.
News April 17, 2025
పురుషులకు అలర్ట్.. ఈ తప్పు చేయకండి

ఆరోగ్యకర ఆహారం తీసుకుంటున్నా, మద్యం, సిగరెట్ అలవాట్లు మానేసినా లైంగిక సామర్థ్యం మెరుగుపడటం లేదని చాలామంది పురుషులు బాధపడుతుంటారు. అయితే విటమిన్-D లోపమూ ఇందుకు కారణమని తాజా అధ్యయనం వెల్లడించింది. ఇది బోన్స్, రోగ నిరోధక శక్తితో పాటు లైంగిక సామర్థ్యంపైనా ప్రభావం చూపుతుందని పేర్కొంది. విటమిన్-డి లెవెల్స్ తగ్గకుండా మెయింటేన్ చేయాలని సూచించింది. పూర్తి వివరాలు ఈ లింక్‌పై <