News April 8, 2025

‘పరీక్షకు విద్యార్థుల ఆలస్యం’పై విచారణకు పవన్ ఆదేశం

image

AP: తన కాన్వాయ్ వల్ల విశాఖ పెందుర్తిలో విద్యార్థులు పరీక్షకు ఆలస్యమయ్యారన్న వార్తలపై Dy.CM పవన్ కళ్యాణ్ స్పందించారు. కాన్వాయ్ కోసం ట్రాఫిక్‌ను ఎంత సేపు నిలిపారో, విద్యార్థులు వెళ్లే సమయంలో ట్రాఫిక్ ఎలా ఉందోనన్న విషయాలపై విచారణ చేయాలని వైజాగ్ పోలీసుల్ని ఆదేశించారు. కాగా.. పవన్ కాన్వాయ్ వెళ్లిన సమయంలోనూ ట్రాఫిక్‌ను ఎక్కడా ఆపలేదని వైజాగ్ పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే.

Similar News

News April 17, 2025

వేసవిలో ఈ జాగ్రత్తలతో చర్మం ఆరోగ్యవంతం!

image

వేసవిలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చర్మం ఆరోగ్యవంతంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా సరిపడా నీళ్లు తాగాలి. దీంతో చర్మం పొడిబారకుండా ఉంటుంది. ఇంటి నుంచి బయటికి వెళ్లాల్సి వస్తే ఫేస్‌కి కచ్చితంగా సన్ స్క్రీన్ వాడాలి. అలాగని, మందంగా కోటింగ్ వేస్తే చర్మ రంధ్రాలు మూసుకుపోయి జిడ్డు పెరిగి పింపుల్స్ వస్తాయి. పెదాల సంరక్షణకు లిప్ బామ్‌లు వాడాలని సూచిస్తున్నారు.

News April 17, 2025

టీడీపీ సంస్థాగత ఎన్నికల నిర్వహణకు కమిటీ నియామకం

image

AP: టీడీపీ సంస్థాగత ఎన్నికల నిర్వహణకు ఆ పార్టీ అధిష్ఠానం కమిటీని నియమించింది. కమిటీ ఛైర్మన్‌గా సీనియర్ నేత వర్ల రామయ్యను ఎంపిక చేసింది. సభ్యులుగా పల్లా శ్రీనివాసరావు, ఎండీ షరీఫ్, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవి, సవితమ్మ, దగ్గుమళ్ల ప్రసాదరావును నియమించింది. TDP అధినేత, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వీరిని నియమిస్తున్నట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

News April 17, 2025

నేడే జేఈఈ మెయిన్ ఫలితాలు

image

JEE మెయిన్ ఫలితాలను నేడు NTA విడుదల చేయనుంది. 2 సెషన్లు పూర్తవడంతో ర్యాంకులు కూడా ఇస్తామని తెలిపింది. అధికారిక సైట్‌లో అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి <>ఫలితాలు<<>> తెలుసుకోవచ్చు. మరోవైపు JEE అడ్వాన్స్‌డ్‌కు ఈ నెల 23 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు కానుండగా, మే 18న ఎగ్జామ్ ఉంటుంది. దేశ వ్యాప్తంగా 12 లక్షలు, తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2లక్షల మంది ఈ పరీక్ష రాశారు.

error: Content is protected !!