News April 8, 2025

టారిఫ్‌లను ఆపే ఆలోచన లేదు: ట్రంప్

image

ప్రపంచ మార్కెట్లు అతలాకుతలమవుతున్న నేపథ్యంలో US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లకు తాత్కాలికంగా విరామం ప్రకటిస్తారన్న వదంతులు వచ్చాయి. వాటిని ట్రంప్ కొట్టిపారేశారు. ‘మా విధానంలో ఎటువంటి మార్పూ ఉండదు. కానీ చర్చలకు రావాలనుకునే ఏ దేశంతోనైనా సరే మాట్లాడేందుకు మేం సుముఖంగా ఉన్నాం’ అని స్పష్టం చేశారు. ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని ఆయనతో భేటీ అయ్యారు. ఇటు భారత్ కూడా ఆ విషయంలో అమెరికాతో చర్చల్లో ఉంది.

Similar News

News April 17, 2025

వేసవిలో ఈ జాగ్రత్తలతో చర్మం ఆరోగ్యవంతం!

image

వేసవిలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చర్మం ఆరోగ్యవంతంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా సరిపడా నీళ్లు తాగాలి. దీంతో చర్మం పొడిబారకుండా ఉంటుంది. ఇంటి నుంచి బయటికి వెళ్లాల్సి వస్తే ఫేస్‌కి కచ్చితంగా సన్ స్క్రీన్ వాడాలి. అలాగని, మందంగా కోటింగ్ వేస్తే చర్మ రంధ్రాలు మూసుకుపోయి జిడ్డు పెరిగి పింపుల్స్ వస్తాయి. పెదాల సంరక్షణకు లిప్ బామ్‌లు వాడాలని సూచిస్తున్నారు.

News April 17, 2025

టీడీపీ సంస్థాగత ఎన్నికల నిర్వహణకు కమిటీ నియామకం

image

AP: టీడీపీ సంస్థాగత ఎన్నికల నిర్వహణకు ఆ పార్టీ అధిష్ఠానం కమిటీని నియమించింది. కమిటీ ఛైర్మన్‌గా సీనియర్ నేత వర్ల రామయ్యను ఎంపిక చేసింది. సభ్యులుగా పల్లా శ్రీనివాసరావు, ఎండీ షరీఫ్, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవి, సవితమ్మ, దగ్గుమళ్ల ప్రసాదరావును నియమించింది. TDP అధినేత, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వీరిని నియమిస్తున్నట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

News April 17, 2025

నేడే జేఈఈ మెయిన్ ఫలితాలు

image

JEE మెయిన్ ఫలితాలను నేడు NTA విడుదల చేయనుంది. 2 సెషన్లు పూర్తవడంతో ర్యాంకులు కూడా ఇస్తామని తెలిపింది. అధికారిక సైట్‌లో అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి <>ఫలితాలు<<>> తెలుసుకోవచ్చు. మరోవైపు JEE అడ్వాన్స్‌డ్‌కు ఈ నెల 23 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు కానుండగా, మే 18న ఎగ్జామ్ ఉంటుంది. దేశ వ్యాప్తంగా 12 లక్షలు, తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2లక్షల మంది ఈ పరీక్ష రాశారు.

error: Content is protected !!