News April 8, 2025

కర్నూలు రేంజ్‌లో సీఐల బదిలీలు

image

కర్నూలు రేంజ్ పరిధిలో సీఐలను బదిలీ చేస్తూ డీఐజీ కోయ ప్రవీణ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సిరివెళ్ల సీఐ వంశీధర్ నంద్యాల వీఆర్‌కు, దస్తగిరి బాబు అన్నమయ్య డీటీసీ నుంచి సిరివెళ్ల, ప్రభాకర్ రెడ్డి అన్నమయ్య ఎస్సీ, ఎస్టీ సెల్ నుంచి నంద్యాల ఫ్యాక్షన్ జోన్, కర్నూల్ డీటీసీ నుంచి నంద్యాల ఉమెన్ పీఎస్, రమేష్ కుమార్ నంద్యాల ఉమెన్ పీఎస్ నుంచి నంద్యాల వీఆర్, కృష్ణయ్య డీసీఆర్బీ నంద్యాలకు బదిలీ అయ్యారు.

Similar News

News November 4, 2025

‘నీ కోసం నా భార్యను చంపేశా’.. మహిళలకు ఫోన్‌పేలో మెసేజ్

image

బెంగళూరులో కృతికా రెడ్డి అనే డాక్టర్ హత్య కేసులో సంచలన విషయం వెలుగులోకొచ్చింది. అధిక మోతాదులో మత్తు మందు ఇచ్చి ఆమెను హత్య చేసిన కేసులో భర్త మహేంద్రా రెడ్డి గత నెలలో అరెస్టయ్యాడు. ‘నీ కోసం నా భార్యను చంపేశా’ అని ఐదుగురు మహిళలకు ఫోన్‌పేలో అతడు మెసేజ్ చేశాడని పోలీసులు వెల్లడించారు. ఏప్రిల్‌లో హత్య తర్వాత కొన్నాళ్లకు ఇలా చేశాడని, పాత బంధాలను తిరిగి కొనసాగించేందుకు తీవ్రంగా ప్రయత్నించాడని చెప్పారు.

News November 4, 2025

బాపట్లలో ప్రైవేట్ బస్సుల్లో తనిఖీలు

image

ప్రైవేటు బస్సులు నడిపేవారు రహదారి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని బాపట్ల వాహన తనిఖీ అధికారి ప్రసన్నకుమారి చెప్పారు. బాపట్ల పట్టణంలో పట్టణ పోలీసులతో కలిసి ప్రైవేటు బస్సులను ఆకస్మికంగా తనిఖీ చేసి ఎమర్జెన్సీ డోర్లను పరిశీలించారు. బస్సుల పత్రాలను పరిశీలించి డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. బస్సులలో ఫైర్ సేఫ్టీ సిలిండర్ అందుబాటులో ఉంచుకోవాలని పరిమితికి మించి వేగంగా ప్రయాణించవద్దని సూచించారు.

News November 4, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

image

✓సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టొద్దు: మణుగూరు డీఎస్పీ
✓దమ్మపేట: కుక్కల దాడిలో నలుగురికి గాయాలు
✓జిన్నింగ్ మిల్లులు యధాతధంగా కొనసాగించాలి: జిల్లా కలెక్టర్
✓భద్రాచలం ఎమ్మెల్యేను నిలదీసిన బీఆర్ఎస్ కార్యకర్తలు
✓సుజాతనగర్ హైస్కూల్ టీచర్లపై కలెక్టర్ ఆగ్రహం
✓బూర్గంపాడు – సారపాక రోడ్డుకు మరమ్మతులు
✓ములకలపల్లి: అడవి పందిని వేటాడిన వ్యక్తి అరెస్ట్
✓పాల్వంచ డిగ్రీ కళాశాలలో ఈనెల 6న జాబ్ మేళా