News April 8, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

image

∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష ∆} ఏన్కూరు మండలంలో ఎంపీ రామ సహాయం పర్యాటన ∆} మధిర ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} కల్లూరులో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ ∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన ∆} పెనుబల్లిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం.

Similar News

News January 21, 2026

ఖమ్మం: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి: ఈసీ

image

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు జిల్లాలో అన్ని ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉండాలని రాష్ట్ర EC కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించారు. షెడ్యూల్ విడుదలైన వెంటనే ప్రవర్తన నియమావళి అమలు, నామినేషన్లు, పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఖమ్మం జిల్లాలో కార్పొరేషన్ మినహా 5 మున్సిపాలిటీల్లో 241 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.

News January 21, 2026

ఖమ్మం: అనారోగ్యంతో సర్పంచ్ మృతి

image

ఖమ్మం జిల్లా సింగరేణి మండలం బోటి తండా గ్రామపంచాయతీ సర్పంచ్ భూక్య తులసిరాం(45)అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో తులసీరామ్ ఏకగ్రీవంగా బోటితండా సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. తులసీరామ్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

News January 21, 2026

ఖమ్మం ఆర్టీసీకి రూ.19.80 కోట్ల ఆదాయం

image

సంక్రాంతి సందర్భంగా ఖమ్మం రీజియన్‌లో రికార్డు స్థాయిలో రూ.19.80 కోట్ల ఆదాయం సమకూరిందని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఈ నెల 9 నుంచి 19 వరకు ఏడు డిపోల పరిధిలో 1,483 అదనపు సర్వీసులను నడిపామని తెలిపారు. డిపో మేనేజర్లు, సిబ్బంది సమన్వయంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సురక్షితంగా చేరవేశామని, అందరి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందని ఆర్టీసీ యంత్రాంగం పేర్కొంది.