News April 8, 2025
అనకాపల్లి: హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

హత్య కేసులో నిందితుడికి జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించినట్లు ఎస్పీ తుహీన్ సిన్హా సోమవారం తెలిపారు. కశింకోట పెట్రోల్ బంక్ వద్ద 2018 జూన్ 8న లారీ డ్రైవర్ శర్వన్ కుమార్ గణపతి, మృతుడు మునిరాజు మధ్య వివాదం జరిగింది. తరువాత మునిరాజు పెట్రోల్ బంక్ సమీపంలో విశ్రమిస్తుండగా శర్వన్ కుమార్ రాయితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. మునిరాజు కేజీహెచ్ లో చికిత్స పొందుతూ జూన్ 9న మృతి చెందినట్లు తెలిపారు.
Similar News
News April 17, 2025
బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకార్ జైన్ బదిలీ

బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రకార్ జైన్‌ను బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనను రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ (RTGS)కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. నూతన జాయింట్ కలెక్టర్ నియమించే వరకు బాపట్ల జిల్లాకు ఇన్‌ఛార్జ్ జాయింట్ కలెక్టర్‌ను నియమించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News April 17, 2025
HYD: స్మితా సబర్వాల్‌కు నోటీసులు జారీ

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్‌కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఏఐ జనరేటెడ్ ఫోటోలను సోషల్ మీడియాలో స్మితా సబర్వాల్ రీ పోస్ట్ చేశారు. దీంతో స్మితా సబర్వాల్‌కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
News April 17, 2025
ప్రకాశం: జిల్లాకు 124 SGT, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు

స్పెషల్ బీఈడీ చేసిన అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రభుత్వం మొదటిసారిగా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో స్పెషల్ బీఈడీ కోర్సులు చేసిన అభ్యర్థులను టీచర్లుగా నియమించనుంది. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 124 SGT, స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేయనుంది. వీటిని మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్లుగా అధికారులు వెల్లడించారు.