News April 8, 2025
నారాయణపేట: హత్య కేసులో నేరస్థుడికి జైలు శిక్ష

హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిందని నారాయణపేట ఎస్పీ యోగేశ్‌గౌతమ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు.. వింజమూరు వాసి జోగువెంకట్ రాములు కొత్తపల్లి(M) తిమ్మారెడ్డిపల్లి వాసి కృష్ణవేణిపై అత్యాచారానికి యత్నించి నిప్పంటించి చంపేశాడు. ఈకేసులో ముద్దాయికి సోమవారం జిల్లా జడ్జి అబ్దుల్ రఫీ శిక్ష విధించారు. 2022 FEB 15న బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేశామన్నారు.
Similar News
News January 16, 2026
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో పోస్టులు

బరక్‌పోర్లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (<
News January 16, 2026
పచ్చని ఓరుగల్లులో పశువుల పండుగ!

పచ్చని పంటలతో నిత్యం కళకళలాడే ఓరుగల్లు వ్యవసాయానికి పెట్టింది పేరు. సంక్రాంతి సంబరాల్లో మూడో రోజైన కనుమ సందర్భంగా.. రైతన్నకు చేదోడువాదోడుగా నిలిచే పశువులకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఎడ్లను రంగులతో ముస్తాబు చేసి, గజ్జెలు, మువ్వలతో అలంకరిస్తారు. ‘పాలి’ పోసి నైవేద్యాలు సమర్పిస్తారు. పలు చోట్ల ఎడ్ల బండ్ల ప్రదర్శనలు నిర్వహిస్తారు. ‘పాడి పంట చల్లగ చూడు.. సిరులు పండేలా దీవించు’ అంటూ దేవుడిని వేడుకుంటారు.
News January 16, 2026
కనుమ రోజు మాంసాహారం తీసుకోకూడదా?

ఆధ్యాత్మికపరంగా కనుమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈరోజు పశువులను దైవంగా భావించి పూజిస్తారు కాబట్టి మాంసాహారం తీసుకోకూడదని పండితులు చెబుతున్నారు. ‘మొదటి మూడు రోజులు శాకాహారంతో దైవచింతనలో గడపడం శ్రేయస్కరం. మాంసాహార ప్రియులు నాలుగవ రోజైన ‘ముక్కనుమ’ నాడు తమకు ఇష్టమైన వంటకాలను వండుకుని తింటారు. కనుమ రోజున పశువుల పట్ల కృతజ్ఞత చూపిస్తూ, శాకాహార నియమాన్ని పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయి’ అని అంటున్నారు.


