News April 8, 2025
నారాయణపేట: హత్య కేసులో నేరస్థుడికి జైలు శిక్ష

హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిందని నారాయణపేట ఎస్పీ యోగేశ్‌గౌతమ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు.. వింజమూరు వాసి జోగువెంకట్ రాములు కొత్తపల్లి(M) తిమ్మారెడ్డిపల్లి వాసి కృష్ణవేణిపై అత్యాచారానికి యత్నించి నిప్పంటించి చంపేశాడు. ఈకేసులో ముద్దాయికి సోమవారం జిల్లా జడ్జి అబ్దుల్ రఫీ శిక్ష విధించారు. 2022 FEB 15న బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేశామన్నారు.
Similar News
News April 17, 2025
HYD: స్మితా సబర్వాల్‌కు నోటీసులు జారీ

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్‌కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఏఐ జనరేటెడ్ ఫోటోలను సోషల్ మీడియాలో స్మితా సబర్వాల్ రీ పోస్ట్ చేశారు. దీంతో స్మితా సబర్వాల్‌కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
News April 17, 2025
ప్రకాశం: జిల్లాకు 124 SGT, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు

స్పెషల్ బీఈడీ చేసిన అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రభుత్వం మొదటిసారిగా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో స్పెషల్ బీఈడీ కోర్సులు చేసిన అభ్యర్థులను టీచర్లుగా నియమించనుంది. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 124 SGT, స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేయనుంది. వీటిని మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్లుగా అధికారులు వెల్లడించారు.
News April 17, 2025
ఒంగోలు: 14 మంది ప్రభుత్వ వైద్యులకు షోకాజ్ నోటీసులు

ప్రకాశం జిల్లాలోని వివిధ ప్రభుత్వ వైద్యశాలల్లో విధులు నిర్వహిస్తున్న 14 మంది ప్రభుత్వ వైద్యులు ఫేషియల్ యాప్ ద్వారా టాంపరింగ్ చేసి అడ్డంగా బుక్కయ్యారు. ఐఫోన్ ద్వారా చిన్నపాటి టెక్నాలజీని ఉపయోగించి ఫేషియల్ యాప్‌ను వినియోగించిన వైద్యులకు ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులను జారీ చేశారు. ఈ టాంపరింగ్‌లో భారీ ఎత్తున వైద్య సిబ్బంది కూడా ఉన్నట్లుగా అధికారులు గుర్తిస్తున్నారు.