News April 8, 2025

రొయ్యకు రెస్ట్.. రైతుల నిర్ణయం

image

AP: రొయ్యల సాగుకు మద్దతు ధరలు లేకపోవడంపై పశ్చిమ గోదావరి జిల్లా రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జులై నుంచి 3 నెలల పాటు రొయ్య సాగుకు విరామం ప్రకటిస్తున్నట్లు పాలకొల్లు, నరసాపురం, ఆచంట నియోజకవర్గాలకు చెందిన రైతులు ప్రకటించారు. మేత నుంచి రొయ్యల మద్దతు ధరల వరకు తమకు అన్యాయం జరుగుతోందని, ప్రాసెసింగ్ ప్లాంట్ల నుంచి ప్రభుత్వం వరకు తమకు అండగా నిలవాలని ఆక్వా రైతులకు డిమాండ్ చేశారు.

Similar News

News April 18, 2025

ఆ కుక్క ధర రూ.50కోట్లు కాదు: ఈడీ

image

బెంగళూరుకు చెందిన సతీశ్ అనే వ్యక్తి ఇటీవల రూ.50కోట్లకు ఓ కుక్కను కొన్నారన్న వార్త SMలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అది కాస్తా ED దృష్టికి వెళ్లడంతో అతని ఇంటిపై దాడి చేసింది. రూ.50 కోట్లు ఎలా వచ్చాయనే లావాదేవీలపై విచారణ జరిపి, వాస్తవాలను బయటపెట్టింది. కాకేసియన్ షెపర్డ్ జాతికి చెందిన ఆ శునకం ధర రూ. లక్ష కూడా ఉండదని తేల్చి చెప్పింది. కేవలం ప్రచారం కోసమే అతను గొప్పలు చెప్పుకుంటున్నట్లు వివరించింది.

News April 18, 2025

జీవిత ఖైదీలకు సర్కార్ గుడ్‌న్యూస్

image

AP: రాష్ట్రంలోని జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న జీవితఖైదీలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు అర్హులైన ఖైదీల పేర్లు సిద్ధం చేయాలంటూ జైళ్ల శాఖ DG అంజనీ కుమార్‌ను ఆదేశించింది. ఎంపిక చేసిన ఖైదీలు రూ.50వేల ష్యూరిటీతోపాటు శిక్షాకాలం పూర్తయ్యే వరకూ స్థానిక PSలో 3నెలలకోసారి సంతకం చేయాలి. మళ్లీ నేరానికి పాల్పడితే క్షమాభిక్ష రద్దవుతుంది.

News April 18, 2025

IPL: SRH చెత్త రికార్డ్

image

MIతో నిన్నటి మ్యాచ్‌లో ఓటమితో SRH బయటి పిచ్‌ల మీద పరాజయాల పరంపర కొనసాగించింది. ఈ సీజన్‌లో ఉప్పల్‌లో కాకుండా SRH వైజాగ్, కోల్‌కతా, ముంబైలో మ్యాచ్‌లు ఆడి, వాటన్నింటిలోనూ ఓడింది. మరోవైపు, మిగతా అన్ని జట్లు బయట ఆడిన మ్యాచ్‌లు గెలిచాయి. ఉప్పల్ వంటి బ్యాటింగ్ పిచ్‌ అయితే SRH భారీ స్కోర్ చేస్తుండటం గమనించిన మిగతా జట్లు స్లో పిచ్‌లను సిద్ధం చేయిస్తున్నాయి. ఆపై తక్కువ రన్స్‌కే కట్టడి చేసి నెగ్గుతున్నాయి.

error: Content is protected !!