News April 8, 2025

SDC మృతి తీరని లోటు: కలెక్టర్

image

స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్.రమ మృతి అత్యంత బాధాకరమని, రెవిన్యూ శాఖకు తీరని లోటని కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు. జేసీ రాజేంద్రన్, DRO మధుసూదన్ రావు, RDO శ్రీనివాస్‌తో కలసి SDC రమ భౌతిక కాయనికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. SDC రమ అంకితభావంతో పనిచేసేవారని గుర్తుచేసుకున్నారు.

Similar News

News April 17, 2025

NLG: ఉద్యోగాలు.. APPLY NOW

image

అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు నమోదుకు ఈనెల 25 వరకు గడువు పొడిగించినట్లు జిల్లా ఉపాధికల్పన అధికారి పద్మ తెలిపారు. ఆర్మీ రిక్రూట్మెంట్ 2025-28 సంవత్సరానికి అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువును పొడిగించారన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు www.joinindianarmy.ac.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News April 17, 2025

బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకార్ జైన్ బదిలీ

image

బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రకార్ జైన్‌ను బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనను రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ (RTGS)కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. నూతన జాయింట్ కలెక్టర్ నియమించే వరకు బాపట్ల జిల్లాకు ఇన్‌ఛార్జ్ జాయింట్ కలెక్టర్‌ను నియమించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News April 17, 2025

HYD: స్మితా సబర్వాల్‌కు నోటీసులు జారీ

image

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్‌కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఏఐ జనరేటెడ్ ఫోటోలను సోషల్ మీడియాలో స్మితా సబర్వాల్ రీ పోస్ట్ చేశారు. దీంతో స్మితా సబర్వాల్‌కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

error: Content is protected !!