News April 8, 2025
బుద్ధవనాన్ని సందర్శించనున్న మిస్ వరల్డ్ పోటీదారులు

బుద్ధపూర్ణిమ సందర్భంగా మే 12న నాగార్జునసాగర్ బుద్ధవనాన్ని మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మిస్ వరల్డ్ పోటీ దారుల రాక ఏర్పాట్లపై సోమవారం తన ఛాంబర్‌లో పర్యాటక, రెవెన్యూ, పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆసియా దేశాలకు చెందిన 30 మంది ప్రపంచ సుందరి పోటీదారులు రానున్నారు.
Similar News
News April 17, 2025
NLG: ఉద్యోగాలు.. APPLY NOW

అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు నమోదుకు ఈనెల 25 వరకు గడువు పొడిగించినట్లు జిల్లా ఉపాధికల్పన అధికారి పద్మ తెలిపారు. ఆర్మీ రిక్రూట్మెంట్ 2025-28 సంవత్సరానికి అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువును పొడిగించారన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు www.joinindianarmy.ac.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News April 17, 2025
ఈ నెల 19న నల్గొండలో ప్రత్యేక ప్రజావాణి

ఈ నెల 19న నల్గొండ కలెక్టరేట్‌లో వయో వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని వయోవృద్ధులు, దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News April 16, 2025
నల్గొండలో యువతి సూసైడ్

యువతి సూసైడ్ చేసుకున్న ఘటన నల్గొండలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మాన్యచెల్కకు చెందిన మాధురి (26) బిటెక్ పూర్తి చేసి ఓ ప్రవేట్ ఉద్యోగం చేస్తోంది. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.