News April 8, 2025
కామారెడ్డిలో కల్తీ కల్లు తాగి 58 మందికి అస్వస్థత

కల్తీ కల్లు తాగి 58 మంది అస్వస్థతకు గురైన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. నస్రుల్లాబాద్ మండలంలోని అంకోల్, అంకోల్ తండా, దుర్కి, బీర్కూర్ మండలం రామరంచ గ్రామాలకు చెందిన 58 మంది సోమవారం కల్లు దుకాణాల్లో కల్తీ కల్లు తాగారు. అనంతరం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది వెంటనే 46 బాన్సువాడ ఆసుపత్రికి, 12 మందిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News April 17, 2025
NLG: వివాహితపై హత్యాయత్నం.. 20 ఏళ్లు జైలు

వివాహితపై యాసిడ్‌తో దాడి చేసిన వ్యక్తికి 20 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ NLG జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. నాంపల్లి(M) దామెర వాసి మహేశ్ గిరిజన మహిళను తన కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురిచేస్తూ 2018లో ఆమెపై యాసిడ్ దాడికి యత్నించాడు. ఆమె నాంపల్లి PSలో ఫిర్యాదు చేయగా అప్పటి SI కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. జడ్జి రోజారమణి నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.2000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
News April 17, 2025
IPL: RR ఓటమి.. ఆ బ్యాటర్‌పై ఫ్యాన్స్ ఫైర్!

నిన్న DCతో మ్యాచులో RR ఓడిపోవడానికి ఆ జట్టు బ్యాటర్ ధ్రువ్ జురెల్ కారణమని ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. 20వ ఓవర్ చివరి 2 బంతుల్లో 3 పరుగులు అవసరం కాగా, జురెల్ రెండో రన్ తీయడానికి నిరాకరించారు. ఆ తర్వాత చివరి బంతికి 1 రన్ మాత్రమే రావడంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్‌లో DC గెలిచింది. జురెల్ రెండో పరుగు తీసి ఉంటే మ్యాచ్ టై అవ్వకుండా RR గెలిచేదని పలువురు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై మీరేమంటారు?
News April 17, 2025
ALERT: నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

AP: ఇవాళ రాష్ట్రంలోని ఉత్తరాంధ్రతోపాటు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. పిడుగులతో కూడిన వర్షాలు పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు నిన్న అనకాపల్లి జిల్లా చీడికాడలో 42.5 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది.