News April 8, 2025

ఈ నెల 11న జాబ్ మేళా

image

TG: టాస్క్ సంస్థతో కలిసి ప్రభుత్వం ఈ నెల 11న వరంగల్‌లో జాబ్ మేళాను నిర్వహించనుంది. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కొండా సురేఖ కోరారు. హాజరయ్యే అభ్యర్థులు ఎండలకు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. యువత భారీ ఎత్తున హాజరై అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.

Similar News

News January 15, 2026

ఐఐటీ రూర్కీలో నాన్ టీచింగ్ పోస్టులు

image

<>ఐఐటీ<<>> రూర్కీ 9 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు జనవరి 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ/బీటెక్, ఎంటెక్/ఎంసీఏ, PhD, PG, MD/MS, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుకు మాజీ ఆర్మీ/నేవీ/IAF అధికారులు, మాజీ DSP అధికారులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iitr.ac.in

News January 15, 2026

సంక్రాంతి: నువ్వుల లడ్డూ తిన్నారా?

image

సూర్యుడు తన కుమారుడైన శనిదేవుని ఇంటికి వెళ్లే రోజే సంక్రాంతి. శనిదేవుడు నల్ల నువ్వులతో తండ్రిని పూజించడంతో వారి మధ్య వైరం తొలగిపోయింది. అందుకే నేడు నువ్వులు తినాలని పండితులు, పెద్దలు చెబుతారు. దీనివల్ల శని ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు. శాస్త్రీయంగా చూసినా చలికాలంలో వాటిని తింటే అనేక లాభాలున్నాయి. రోగనిరోధక శక్తిని అందిస్తాయి. అందుకే పండక్కి నువ్వుల లడ్డూలు చేస్తారు. మరి మీరు తిన్నారా? COMMENT

News January 15, 2026

కోళ్ల పెంపకంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది

image

వారాంతపు సంతలో కోళ్లను కొని కొందరు పెంపకందారులు వాటిని తీసుకొచ్చి ఇంటి దగ్గర ఉన్న కోళ్లలో కలుపుతారు. అయితే కొత్తగా తెచ్చిన కోళ్లకు వ్యాధులుంటే మొత్తం అన్ని కోళ్లకు సోకి మరణిస్తాయి. ఈ పద్ధతిని మానేయాలి. పెద్ద కోళ్లను, కోడి పిల్లలను కలిపి కాకుండా వాటి వయసుకు తగ్గట్లు ప్రత్యేకంగా పెంచాలి. కోళ్ల షెడ్‌ను శుభ్రం చేశాకే కొత్త కోళ్లను వదలాలి. కోళ్ల షెడ్డులోకి గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి.