News April 8, 2025
BHPL: సింగరేణి పాఠశాలల్లో ఉచిత పాలిటెక్నిక్ కోచింగ్

సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో అన్ని సింగరేణి పాఠశాలల్లో ఉచిత పాలిటెక్నిక్ కోచింగ్ నిర్వహించనున్నట్లు ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి జి.శ్రీనివాస్ తెలిపారు. విద్యార్థుల కోసం ఏరియాలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో శిక్షణ తరగతులను ఈ నెల 10వ తేదీన ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
Similar News
News November 11, 2025
కూతురు తెచ్చిన అదృష్టం.. పావు కేజీ గోల్డ్ గెలిచాడు

బెంగళూరుకు చెందిన మంజునాథ్ హరోహళ్లికి దుబాయ్‌లో జాక్‌పాట్ తగిలింది. బిగ్ టికెట్ లాటరీలో 250 గ్రాముల 24 క్యారెట్ల బంగారాన్ని గెలుచుకున్నారు. ఏడేళ్లుగా టికెట్ కొనుగోలు చేస్తున్న అతను ఈసారి తన కూతురి చేతుల మీదుగా టికెట్ తీసుకున్నారు. దీంతో అదృష్టం వరించింది. లాటరీ గెలవడాన్ని నమ్మలేకపోతున్నానని మంజునాథ్ చెప్పారు. తన కూతురి రూపంలో లక్ కలిసొచ్చిందని, ఆమె కోసం బహుమతి తీసుకుంటానని ఆయన తెలిపారు.
News November 11, 2025
నంద్యాల విద్యార్థినికి వైఎస్ జగన్ రూ.లక్ష ప్రోత్సాహకం

SSC-2025లో రాష్ట్రంలో రెండో ర్యాంకు సాధించిన నంద్యాల విద్యార్థిని షేక్ ఇష్రత్ (599/600) మంగళవారం వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా జగన్ ఆమెను అభినందించి, రూ.లక్ష ప్రోత్సాహకం ప్రకటించారు. మహిళలు చదువుకుంటేనే సమాజంలో గౌరవం లభిస్తుందని, ఉన్నత లక్ష్యంతో చదవాలని జగన్ ఇష్రత్‌కు సూచించారు.
News November 11, 2025
బిహార్.. ఎన్డీఏదే గెలుపు!

* Matrize exit poll: ఎన్డీఏ 147-167, ఎంజీబీ 70-90
* People’s Insight: ఎన్డీఏ 133-148, ఎంజీబీ 87-102
* చాణక్య స్ట్రాటజీస్: ఎన్డీఏ 130-138, ఎంజీబీ 100-108
* POLSTRAT:ఎన్డీఏ 133-148, ఎంజీబీ 87-102
*CNN న్యూస్ 18: ఫస్ట్ ఫేజ్ (121)లో ఎన్డీఏ 60-70, ఎంజీబీ 45-55
* JVC EXIT POLL: ఎన్డీఏ 135-150, ఎంజీబీ 88-103


