News April 8, 2025
దిగొచ్చిన ప్రభుత్వం.. ఆరోగ్య శ్రీ కొనసాగింపు

AP: ఆరోగ్య శ్రీ సేవలను నెట్‌వర్క్ ఆస్పత్రులు నిన్న నిలిపివేయడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. రూ.500 కోట్ల బకాయిలు తక్షణం చెల్లిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇవ్వడంతో సమ్మె విరమిస్తున్నట్లు నెట్‌వర్క్ ఆస్పత్రులు ప్రకటించాయి. దీంతో ఇవాళ్టి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి. అటు ఈ నెల 10 తర్వాత ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌తో నెట్‌వర్క్ ఆస్పత్రుల ప్రతినిధులు చర్చలు జరపనున్నారు.
Similar News
News April 17, 2025
IPL: RR ఓటమి.. ఆ బ్యాటర్‌పై ఫ్యాన్స్ ఫైర్!

నిన్న DCతో మ్యాచులో RR ఓడిపోవడానికి ఆ జట్టు బ్యాటర్ ధ్రువ్ జురెల్ కారణమని ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. 20వ ఓవర్ చివరి 2 బంతుల్లో 3 పరుగులు అవసరం కాగా, జురెల్ రెండో రన్ తీయడానికి నిరాకరించారు. ఆ తర్వాత చివరి బంతికి 1 రన్ మాత్రమే రావడంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్‌లో DC గెలిచింది. జురెల్ రెండో పరుగు తీసి ఉంటే మ్యాచ్ టై అవ్వకుండా RR గెలిచేదని పలువురు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై మీరేమంటారు?
News April 17, 2025
ALERT: నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

AP: ఇవాళ రాష్ట్రంలోని ఉత్తరాంధ్రతోపాటు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. పిడుగులతో కూడిన వర్షాలు పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు నిన్న అనకాపల్లి జిల్లా చీడికాడలో 42.5 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది.
News April 17, 2025
SRH: హెడ్, అభిషేక్‌లపైనే భారమంతా?

IPLలో భాగంగా ఇవాళ MIతో SRH ఢీకొననుంది. కాగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ రాణిస్తేనే SRH గెలుస్తోంది. లేదంటే ఆ జట్టు గాడి తప్పుతోంది. గణాంకాలను చూస్తే ఇది తేటతెల్లమవుతోంది. వీరిద్దరూ కలిసి ఇప్పటివరకు 21 ఇన్నింగ్సులు ఆడారు. ఇందులో గెలిచిన 11 మ్యాచుల్లో 801 రన్స్ కొట్టారు. అదే ఓడిన 10 ఇన్నింగ్సుల్లో 145 పరుగులే చేశారు. గెలిచిన మ్యాచుల్లో జట్టు రన్ రేట్ 14.5 ఉండగా ఓడిన వాటిలో 8.78 మాత్రమే ఉంది.