News April 8, 2025

జియ్యమ్మవలస: ఉపాధి హమీ కూలీ మృతి

image

జియ్యమ్మవలస మండలం డంగభద్రలో జరుగుతున్న ఉపాధి హామీ పనులకు వెళ్లిన పల్ల సీతమ్మ వడదెబ్బ తగిలి మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. గ్రామానికి సమీపంలో ఉన్న చెరువు వద్దకు సోమవారం మధ్యాహ్నం పనులకు వెళ్లారు. ఈ సమయంలో సీతమ్మ సొమ్మసిల్లి పడిపోయారు. తోటి పనివారు ఆమెను ఇంటికి తీసుకువస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్లు తెలిపారు.

Similar News

News July 6, 2025

రేపు ములుగు జిల్లాలో మంత్రుల పర్యటన

image

మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క జిల్లాలో సోమవారం పర్యటించనున్నారు. కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం మండలాల్లో నకిలీ విత్తనాలతో పంటకు నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెక్కులను అందజేయనున్నారు. అనంతరం సీతక్క మంగపేట, ఏటూరునాగారం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసే కార్యక్రమంలో పాల్గొననున్నారు.

News July 6, 2025

రాజమండ్రి : ప్రయాణికులకు గమనిక

image

ఆషాఢ మాసం సందర్భంగా రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్లే ఇంద్ర ఏ.సీ బస్సు ధరలో 15% రాయితీ కల్పించినట్లు ఆర్టీసీ డీఎం కె.మాధవ తెలిపారు. నేడు ఆయన ఓ ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. రాజమండ్రి – హైదరాబాద్‌కు సూపర్ లగ్జరీ తక్కువ ధరకు ఇంద్ర ఏ.సీ బస్సులో ప్రయాణించ వచ్చుని అన్నారు.ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు. ప్రస్తుత టిక్కెటు ధర రూ.1060లు కాగా రాయితీపై ధర రూ.920గా ఉందని చెప్పారు.

News July 6, 2025

JNTUలో కౌన్సెలింగ్.. విద్యార్థులకు కీలక సూచన

image

TG EAPCET 2025లో భాగంగా ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. దీనికి సంబంధించి అధికారులు మరో కీలక సూచన చేశారు. కౌన్సెలింగ్ పూర్తయిన విద్యార్థులు సాయంత్రం 4 గంటల నుంచి వెబ్ ఆప్షన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియ మంగళవారం సాయంత్రం వరకు కొనసాగుతుందని ఓ ప్రకటనలో తెలిపారు.