News April 8, 2025
వనపర్తి జిల్లా బిడ్డకు GOVT జాబ్.. సన్మానం

వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన పోలీస్ వెంకట్ స్వామి కుమారుడు మండ్ల పవన్ కుమార్ ఇటీవల వెలువడిన గ్రూప్ ఫలితాల్లో మంచి మార్కులు సాధించి అడిషనల్ కలెక్టర్‌గా ఎంపికయ్యాడు. ప్రముఖ వైద్యుడు పీజే బాబు ఆధ్వర్యంలో కొత్తకోటకు చెందిన సన్రైజర్స్ వాకింగ్ క్లబ్ సభ్యులు పవన్ కుమార్‌ను ఘనంగా సన్మానించారు. రాములు యాదవ్, వెంకటయ్య, శ్రీనివాసులు, సురేశ్, భాస్కర్, వినోద్ సాగర్, కిషోర్ పాల్గొన్నారు.
Similar News
News October 31, 2025
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ పర్యటన

తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య శనివారం నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. NZB(D) నందిపేటలో కేదారేశ్వర ఆశ్రమాన్ని దర్శించనున్నారు. అనంతరం నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రవీణ్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం కామారెడ్డి సఖి కేంద్రాన్ని సందర్శిస్తారు. ఫరీద్‌పేట ఘటన బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించనున్నారు.
News October 31, 2025
3 రాష్ట్రాల్లో పోటీ.. ఓ గెలుపు.. తొలిసారి మంత్రి

TG: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, <<18158294>>మంత్రి అజహరుద్దీన్<<>> పొలిటికల్ జర్నీ 3 రాష్ట్రాల మీదుగా సాగింది. 2009లో INCలో చేరిన ఆయన మొరదాబాద్(UP) ఎంపీగా గెలిచారు. 2014లో టోంక్ సవాయూ మాధోపుర్(రాజస్థాన్) లోక్‌సభ స్థానంలో ఓడిపోయారు. 2019లో టికెట్ దక్కలేదు. 2023లో సొంతరాష్ట్రం తెలంగాణలోని జూబ్లీహిల్స్ MLAగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ప్రత్యేక రాజకీయ పరిస్థితుల మధ్య ఇవాళ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
News October 31, 2025
RITESలో 600 పోస్టులు.. అప్లై చేశారా?

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(RITES)లో 600 సీనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. బీఎస్సీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు నవంబర్ 12వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.300, SC,ST, PWBDలకు రూ.100. వెబ్‌సైట్: https://www.rites.com


