News April 8, 2025

ఆదిలాబాద్‌: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

image

మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని KRK కాలనీలో వ్యభిచార గృహంపై పోలీసులు సోమవారం దాడి చేశారు. భాగ్యలక్ష్మి, గంగన్న అనే ఇద్దరు.. అమాయక మహిళలు, యువతులకు డబ్బు ఆశ చూపుతూ వ్యభిచారం చేయిస్తున్నట్లు ఎస్ఐ విష్ణువర్ధన్ తెలిపారు. ఇద్దరు బాధిత మహిళలను అదుపులోకి తీసుకొని సఖి కేంద్రానికి తరలించి ఆశ్రయం కల్పించామన్నారు. నిందితులైన భాగ్యలక్ష్మి, గంగన్నతో పాటు విటులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.

Similar News

News April 19, 2025

తనదైన మార్క్ చూపిస్తున్న ADB SP అఖిల్ మహాజన్

image

ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే, ఇల్లీగల్ దందాలు నిర్వహించే వారిపై ADB SP అఖిల్ మహాజన్ ప్రత్యేక దృష్టి సారించారు. సోషల్ మీడియాలో మరణాయుధాలతో పోస్టులు పెట్టిన సలీం, వెంకట్, నరేష్, కార్తీక్, సిద్ధూ, సాయి, ఇర్ఫాన్‌లపై కేసులు పెట్టారు. మహిళను వేధించిన వ్యక్తిని HYD నుంచి తీసుకొచ్చి అరెస్ట్ చేయించారు. పలు కేసుల్లో నిందితులు, రౌడీషీటర్లపై ఫోకస్ పెట్టడంతో వారు కూడా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోతున్నారు.

News April 19, 2025

ADB: మహిళ కడుపులో 3.5కిలోల గడ్డ.. అరుదైన చికిత్స

image

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ గ్రామానికి ఓ మహిళ కడుపులో నుంచి ముడున్నర కిలోల ఫైబ్రాయిడ్ గడ్డను వైద్యులు తొలగించారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాక వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం అరుదైన ఆపరేషన్ చేసినట్లు డాక్టర్ హేమరాజ్ సింగ్ తెలిపారు. మహిళ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపారు. మహిళ కుటుంబీకులు వైద్యులకు ధన్యవాదాలు చెప్పారు.

News April 19, 2025

ADB: అమ్మాయిని వేధించాడు.. అరెస్టయ్యాడు

image

సోషల్ మీడియా ద్వారా బోథ్ పట్టణానికి చెందిన ఒక అమ్మాయిని వేధించిన కేసులో నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తికి చెందిన అలీమ్ బేగ్ అనే వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేసినట్లు SI ప్రవీణ్‌కుమార్ తెలిపారు. అతడిని రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నారు. నిందితుడిపై రెంజల్ పోలీస్ స్టేషన్‌లో ఇదివరకే నాలుగు కేసులు, రౌడీ షీట్ ఉన్నాయని తెలిపారు.

error: Content is protected !!