News April 8, 2025

HNK: ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు

image

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం చింతగట్టు రింగ్ రోడ్డు బ్రిడ్జి వద్ద తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఒంగోలు నుంచి ఆదిలాబాద్‌కు వెళ్లే లహరి ఎక్స్‌ప్రెస్ బస్సుగా గుర్తించారు. గాయాలైన వారిని చికిత్స కోసం 108 ద్వారా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 5, 2025

రెండో పెళ్లి రిజిస్టర్ చేయాలంటే మొదటి భార్య వాదన వినాలి: HC

image

ముస్లిం పర్సనల్ లా ప్రకారం పురుషుడి బహుభార్యత్వానికి అనుమతి ఉంది. అయితే మొదటి భార్య బతికి ఉండగా చేసుకొనే రెండో పెళ్లిని గుర్తించాలంటే అధికారులు కొన్ని నిబంధనలు పాటించాలని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. ఆ పెళ్లిని రిజిస్టర్ చేసే ముందు మొదటి భార్య అంగీకారం ఉందో లేదో పరిగణనలోకి తీసుకోవాలంది. ‘ఇలాంటి సందర్భాల్లో మతాచారాలు సెకండరీ. రాజ్యాంగ హక్కులే సుప్రీం’ అని జస్టిస్ PV కున్హికృష్ణన్ పేర్కొన్నారు.

News November 5, 2025

కార్తీకం: పునర్జన్మను ప్రసాదించే పవిత్ర స్తోత్రాలివే

image

కార్తీక మాసంలో లక్ష్మీ స్తోత్రం, కనకధార స్తోత్రం, విష్ణు స్తోత్రం పఠించడం వలన విశేషమైన ఫలితాలుంటాయని పండితులు చెబుతున్నారు. ఈ స్తోత్ర పారాయణం ద్వారా శ్రేయస్సు, ఆనందాన్ని పొందుతారని అంటున్నారు. ‘ఈ మాసంలో పద్ధతులను నిష్ఠగా పాటించే భక్తులు మరణానంతరం ఉత్తమ లోకంలో స్థానాన్ని సంపాదించుకుంటారు. పునర్జన్మను పొందుతారు. జీవించి ఉన్నంత కాలం కుటుంబంతో సంతోషకరమైన, సుఖమయమైన జీవితాన్ని గడపవచ్చు’ అంటున్నారు.

News November 5, 2025

GWL: ఈనెల 8న వేములవాడకు స్పెషల్ బస్సు-DM సునీత

image

కార్తీక మాసం సందర్భంగా గద్వాల జిల్లా భక్తుల సౌకర్యార్థం వైష్ణవ ఆలయాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోందని డీఎం సునీత బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు. వేములవాడ దర్శిని పేరుతో వేములవాడ, కోటిలింగాలు, ధర్మపురి, కొండగట్టు, కొమరవెల్లి క్షేత్రాలు 2 రోజుల్లో దర్శించుకునేందుకు ఈనెల 8న తెల్లవారుజామున 4:00 సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరుతుందన్నారు. ఒకరికి రూ.2,350 ఛార్జీ ఉంటుందన్నారు. Contact 9959226290